గత రాత్రి వైజాగ్ లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఆడియో వేడుక మెగా అభిమానుల మధ్య రంగరంగ వైభవంగా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ ఆడియో వేడుకకి రామ్ చరణ్ భార్య ఉపాసనతో అటెండ్ కాగా.... ఆయన ఇద్దరు చెల్లెల్లు... సుశ్మిత, శ్రీజలు భర్త పిల్లల్తో హాజరయ్యారు. ఇక ఈ ఆడియో వేడుకకి మెగాస్టార్ తన భార్య బావమరిది అల్లు అరవింద్ తో పాటు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఇక రంగస్థలం హీరోయిన్ సమంత, ఐటెం గర్ల్ పూజ హెగ్డే, ఆది పినిశెట్టి, రామ్ చరణ్ కి అత్తగా నటించిన హాట్ యాంకర్ అనసూయలు హాజరయ్యారు. అయితే ఈ ఆడియో వేడుకలో రంగస్థలం ట్రైలర్ ని లాంచ్ చేసిన సుకుమార్ ఎక్కడా రంగస్థలం కథ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రతి ఒక్కరు చెప్పిన స్పీచ్ లోను రంగస్థలం స్టోరీ రివీల్ కాలేదు కానీ చిరు మాత్రం రంగస్థలంలోని ట్విస్ట్ ని అలా అలా ఎమోషనల్ గా రివీల్ చేసేశాడు.
ప్రొడ్యూసర్స్, దర్శకుడు, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడిన చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ గురించి మాట్లాడినప్పుడు సినిమాలో అసలు ట్విస్ట్ గురించి రివీల్ చేశాడు. అది కావాలని చెయ్యకపోయినా దర్శకుడు సుకుమార్ మాత్రం ఒకింత కంగారు పడిన క్షణమిది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఆది పినిశెట్టిలు ఆనందమ్ములుగా నటిస్తున్నారు. అన్న కోసం ప్రాణం ఇచ్చే పాత్రలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇక రంగస్థలం ప్రెసిడెంట్ జగపతి బాబు మీద ఎలెక్షన్స్ లో కుమార్ బాబు (ఆది) పోటీ చెయ్యడం దాని కోసం చిట్టిబాబు(చరణ్) చాలా కష్టపడడం.. అన్నగారి వెన్నంటే ఉండడం ఇలా రంగస్థలం ట్రైలర్ లో మనకి అర్థమైంది.
అయితే ఈ అన్నదమ్ముల కథ ఫైనల్ కి చేరుకునే సరికి ఎలా ఉంటుందో అనుకునేలోపు చిరంజీవి తన కొడుకు చరణ్ గురించి మాట్లాడుతూ చరణ్ ఈ రంగస్థలంలో ఎమోషనల్ గా ఎంతో అద్భుతంగా నటించాడు అని చెబుతూ.... అందులో కీలకమైన ఆది డెత్ ఎపిసోడ్ అని చిరంజీవి స్లిప్ కావడంతో ఆ పాత్ర ముగింపు విషాదకరంగా ఉంటుంది అనే కన్ఫర్మేషన్ వచ్చేసింది. మరి చిరు చెప్పిన డెత్ మిష్టరీని బట్టి ప్రెసిడెంట్ జగపతి బాబుకు పోటీగా దిగిన కుమార్ బాబు (ఆది పినిశెట్టి)ని ప్రత్యర్థులు చంపేస్తారు. దీంతో చిట్టిబాబు శివతాండవం చేస్తూ ప్రత్యర్థులను మట్టుబెట్టడంతో రంగస్థలం క్లైమాక్స్ పూర్తవుతుంది. మరి సినిమాలో ఇంత కీలకమైన ఈ ట్విస్ట్ బయట పడటం అందులోని థ్రిల్ అయితే మిస్ అవుతుంది.