అక్కినేని అఖిల్ - విక్రమ్ కాంబోలో వచ్చిన హలో సినిమా గత ఏడాది డిసెంబర్ 22 నే విడుదలై హిట్ టాక్ తో యావేరేజ్ కలెక్షన్స్ తెచ్చుకుంది. ఆ సినిమా విడుదలైన మూడు నెలలు అఖిల్ తన మూడో ప్రాజెక్ట్ గురించి అధికారికంగా అనౌన్స్ చేశాడు. నిన్నమొన్నటివరకు కొరటాల డైరెక్షన్ లో అఖిల్ సినిమా అనే హెడ్ లైన్స్ తో అనేక రకాలుగా ప్రచారం జరిగినా తొలిప్రేమ వంటి స్వీట్ ప్రేమకథని ప్రేక్షకులకు అందించి తన మొదటి ప్రయత్నంతోనే బిగ్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి తో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని చెయ్యబోతున్నాడు. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా ఈ ఉగాది నాడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు.
అఖిల్ సినిమాని నితిన్, హలో సినిమాని నాగార్జున ఓన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించగా ఇప్పుడు అఖిల్ మూడో ప్రాజెక్ట్ ని బీ. వీ ఎస్. ఎన్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కుతుంది. మరి వెంకీ అట్లూరి తొలిప్రయత్నంలోనే తొలిప్రేమతో తిరుగులేని హిట్ సొంతం చేసుకుని రెండో సినిమాకే అఖిల్ వంటి స్టార్ ని పట్టేశాడు. వరుణ్ తేజ్ కి తొలిప్రేమతో కెరీర్ లో గుర్తుండిపోయే హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఇప్పుడు అఖిల్ కి కూడా ఒక చక్కటి ప్రేమకథతో మంచి హిట్ సినిమాని అందించాలని అనుకుంటున్నాడు. ఇకపోతే వెంకీ అట్లూరికి, అఖిల్ కి మధ్యన అప్పుడే స్టోరీ డిస్కర్షన్స్ కూడా పూర్తవడంతోనే ఇప్పుడు అఖిల్ అధికారికంగా తమ కాంబో సినిమా విషయాన్ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది.
ఈసారి కూడా తొలిప్రేమ లాంటి ప్రేమ కథతోనే అఖిల్ ని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేయబోతున్నాడట. మరి మాస్ హీరోగా ఇండస్ట్రీని ఏలుదామనుకున్న అఖిల్ ఆ సినిమాతో భారీ ప్లాప్ అందుకున్నాడు. అలాగే హలోతో లవ్ స్టోరీ టచ్ చేసి యావరేజ్ హిట్ అందుకున్నాడు. కాని ఈసారి పూర్తి స్థాయి ప్రేమకథని ఎంచుకుని ఫుల్ కొట్టాలని అక్కినేని కుర్రోడు గట్టిగా ఫిక్స్ అయిపోయాడు.