బాలకృష్ణ - బోయపాటి సినిమా కలయిక అంటే ఆ సినిమాకి వచ్చే క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. మరి వాళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు అలాంటి రిజెల్ట్ నిచ్చాయి. సింహ, లెజెండ్ సినిమాలు బాలకృష్ణకి తిరుగులేని స్టార్ డమ్ ని తెచ్చిపెట్టాయి. అంతకుముందే స్టార్ హీరో అయిన బాలకృష్ణకి సింహ, లెజెండ్ సినిమాలకు ముందు వరుస పరాజయాలు ఉండడంతో బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలతోనూ బాలయ్యకి ఎదురులేకుండా పోయింది. మళ్ళీ వీరి కాంబోలో మూడో సినిమా ఉంటుందని గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతున్నా ఎందుకో ఏమో.. బాలయ్య మాత్రం బోయపాటితో సినిమా చెయ్యడానికి ఆసక్తి కనబర్చడం లేదు.
కానీ బాలకృష్ణతో సినిమా చెయ్యాలని బాలయ్య చుట్టూనే తిరుగుతున్నాడు బోయపాటి. బాలకృష్ణ ఇతర డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నా ఆయా సినిమాల ఫంక్షన్స్ కి బోయపాటి బాలయ్యతో పాటు వెళుతున్నా.... బాలయ్య మాత్రం బోయపాటిని పంటించుకున్న పాపాన లేదు. అయినా బాలయ్య - బోయపాటి కలయికలో సినిమా అని వార్తలొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కూడా బాలకృష్ణతో బోయపాటి సినిమా 2018 లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ తో బిజీ అవుతుంటే... బోయపాటి, రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
మరి ఈ రెండు సినిమాలు ఈ నెలలోనే మొదలై ఒకేసారి పూర్తవుతాయి కాబట్టి.. అప్పుడు బాలకృష్ణ - బోయపాటి సినిమా ఉంటుంది అంటున్నారు. కేవలం అనడమే కాదండోయ్ బాలకృష్ణ పుట్టిన రోజైన జూన్ 10వ తేదీన, ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగొచ్చని కూడా అంటున్నారు. మరి రెండు సినిమాలతో హిట్ అందుకున్న వీరిద్దరూ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.