Advertisementt

శ్రియ.. పెళ్లి చేసేసుకుంది..!

Sat 17th Mar 2018 09:58 PM
shriya,marriage,boyfriend,andrei koscheev  శ్రియ.. పెళ్లి చేసేసుకుంది..!
Shriya Married Boyfriend Andrei Koscheev శ్రియ.. పెళ్లి చేసేసుకుంది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్, కోలీవుడ్ లలో శ్రియ శరణ్ హీరోయిన్ గా అనేక రకాల పాత్రల్లో నటించింది. దశాబ్ద కాలంగా హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ భామకు ప్రస్తుతం సీనియర్ హీరోస్ పక్కన అవకాశాలు తప్ప చేతిలో ఓ అన్నంత అవకాశాలు లేవు. కానీ ఫ్యాషన్ షోస్ లో, హాలిడే వెకేషన్స్ లో, హాట్ హాట్ ఫోజులతో శ్రియ తనలో ఇంకా మెరుపు తగ్గలేదని నిరూపిస్తోనే ఉంది. కానీ ఈ ముదురు భామను హీరోయిన్ గా తీసుకోవడానికి యంగ్ హీరోలెవరు సిద్ధంగా లేరు. గత ఏడాది బాలకృష్ణతో నటించిన శ్రియ అడపాదడపా చేతిలో ఉన్న సినిమాల్తో కాస్త బిజీగా ఉంది. 

ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి కూడా చేసుకుంది. గత కొంతకాలంగా ఆండ్రీ తో సీక్రెట్ లవ్ ఎఫ్ఫైర్ నడుపుతున్న శ్రియ ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకుని ఒక ఇంటిదైంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తన రష్యా ప్రియుడు ఆండ్రీ ని శ్రియ ఈ నెల 12న వివాహం చేసుకున్నట్లు 'మిడ్ డే' టాబ్లాయిడ్ ఓ కథనాన్ని హైలెట్ చేస్తూ ప్రచురించింది. ఆ కథనం ప్రకారం శ్రియ అంథేరిలోని తన నివాసంలో ఆండ్రీతో ఆమె వివాహం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ పెళ్ళికి శ్రియ ఫ్రెండ్స్ తో పాటు శ్రియ నైబరీస్ అయిన బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ఆయన భార్య షబానా హాజరయినట్లుగా తెలుస్తుంది.

ఇంకా 'మిడ్ డే' టాబ్లాయిడ్ కథనం ప్రకారం శ్రియ ఆండ్రీ ని హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుందని.... ఈ పెళ్ళికి ముందు శ్రియ నివాసంలో అదిరిపోయే విందు కార్యక్రమం జరిగిందని కూడా ప్రచురించింది. ఇంకా శ్రియ తన పెళ్ళికి పింక్ కలర్ దుస్తులు వేసుకున్నట్టుగా చెబుతుంది. అలాగే ఈ పెళ్లి తర్వాత ఉదయపూర్ వేదికగా శ్రియ - ఆండ్రీ ల జంట పెళ్లి తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారని కూడా 'మిడ్ డే' టాబ్లాయిడ్ ప్రచురించింది.

Shriya Married Boyfriend Andrei Koscheev:

Shriya Married Secretly!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ