బాలయ్య కి ఆమె కూడా నో చెప్పేసిందా..? బాలకృష్ణతో నటించడానికి తాము ఎంతో భయపడ్డామని, ఆయనకు కోపం ఎక్కువని, కోపం వస్తే కొడతారని, ఏవేవో మాటలు విన్నాం. అందువల్లే ఆయన చిత్రాలలో నటించేందుకు ముందు ఎంతో ఆలోచించామని పలువురు చెప్పడం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా ఆయనతో పనిచేసిన హీరోయిన్ల నుంచి కామెడీ విలన్ ఫిష్ వెంకట్ వరకు ఎవరిని కదిలించినా ఇదే మాట వినిపిస్తోంది. అదే సమయంలో ఆయన ఎంతో గౌరవం ఇస్తారని, ఇతరులతో మర్యాదగా ఉంటారని, తాము బయట విన్నవి నిజం కాదని షూటింగ్ తర్వాత తెలుసుకున్నామని రొటీన్ స్టేట్‌మెంట్స్ ఇస్తుంటారు. ఇక నాడు మీరాజాస్మిన్ కూడా పలు కారణాల వల్ల రవితేజ విషయంలోకి వచ్చేసరికి బాలయ్యతో నటించడానికి భయపడిందని కూడా వార్తలు వచ్చాయి.
ఇక తెలుగులో నందమూరి, అక్కినేని, మంచు, ఘట్టమనేని, మెగా ఫ్యామిలీలు ముఖ్యమైనవి. బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ ఎన్టీఆర్, ఏయన్నార్‌లకి కూడా సన్నిహితుడు. నాగార్జున ఆయనతో తనకి ఉన్న పరిచయంతో ఏయన్నార్ చివరి చిత్రం 'మనం'లో కామియో పాత్రను పోషించడానికి అమితాబ్‌ని అడిగిన వెంటనే ఓకే చెప్పాడు. ఇక చిరంజీవి 'సై..రా.. నరసింహారెడ్డి'లో కీలకపాత్ర చేయమంటే ఓకే అని చెప్పాడు. అదే బాలకృష్ణ తన 'రైతు' చిత్రంలో నటించమని 'సర్కార్ 3' సెట్స్‌కి దర్శకుడు కృష్ణవంశీతో కలిసి వెళ్లి స్వయంగా అడిగినా నో చెప్పాడు. చివరకు అమితాబ్ నో చెప్పడంతో ఈ ప్రాజెక్టే ఆగిపోయింది. దీనిని బట్టి అయినా బాలయ్య కాస్త తేడా మనిషేనని అర్ధమవుతోంది. ఇక బాలయ్య ఈనెల 29న తన తండ్రి 'ఎన్టీఆర్'బయోపిక్‌ని తేజ దర్శకత్వంలో స్టార్ట్ చేస్తున్నాడు. రెగ్యూలర్ షూటింగ్ జూన్ నుంచి మొదలుకానుంది.
ఇక ఇందులో ఎన్టీఆర్ భార్య, బాలకృష్ణ తల్లి బసవతారకం పాత్ర ఎంతో కీలకం మాత్రమే కాదు.. బరువైన పాత్ర కూడా. దీనిని చేయమని నిత్యామీనన్‌ని అడిగితే నో చెప్పింది. ఈ చిత్రంలోని పలు పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తున్నారు. తేజ బాలయ్యల ఉద్దేశ్యం ప్రకారం బసవతారకం పాత్రని కాస్త పేరున్న వారు నటించాలి. దాంతో వారు విద్యాబాలన్‌ని కూడా అడిగారట. మొదట ఓకే చెప్పిన ఆమె ఇప్పుడు మాత్రం కాల్షీట్స్ లేవని తప్పించుకుందని సమాచారం. కేవలం బాలయ్య మీద వచ్చే కామెంట్స్ వల్లే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.