Advertisementt

నాకు ఇద్దరు లవర్స్ ఉన్నారు: కాజల్!

Sat 17th Mar 2018 01:49 PM
kajal agarwal,lovers,heroine,kajal  నాకు ఇద్దరు లవర్స్ ఉన్నారు: కాజల్!
Kajal Agarwal about Her Love నాకు ఇద్దరు లవర్స్ ఉన్నారు: కాజల్!
Advertisement
Ads by CJ

'లక్ష్మీకళ్యాణం' ద్వారా పరిచయమై, 'చందమామ, మగధీర' చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని యంగ్‌స్టార్స్‌ అందరితో పాటు సీనియర్‌ స్టార్స్‌ సరసన కూడా నటిస్తున్న నటి కాజల్‌ అగర్వాల్‌. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటింది. 50కి పైగా చిత్రాలలో నటించింది. రామ్‌చరణ్‌ నుంచి చిరంజీవి వరకు అందరితో జోడీ కట్టింది. ఈమద్య రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' అనిపించుకుంది. ఇక ఈమె తమిళంలో కూడా అజిత్‌, విజయ్‌ నుంచి యంగ్‌ స్టార్స్‌తో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. ఇక ఈమె తన మొదటి చిత్రం హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌ సరనన మరలా ఇంతకాలానికి 'ఎమ్మెల్యే' చిత్రంలో నటిస్తోంది. 

తాజాగా ఈమెని ఎవరినైనా ప్రేమించారా? పెళ్లెప్పుడు? అని అడిగితే ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. నేను సినిమాలలోకి రాకముందు ఓ యువకుడి ప్రేమలో పడ్డాను. సినిమాలలోకి వచ్చిన తర్వాత మరోకరితో ప్రేమలో పడ్డాను. సినిమాలలోకి రాకముందు ప్రేమించడం ఈజీనే. ఎందుకంటే మనకు బోలెడు సమయం ఉంటుంది. ప్రియులతో గడిపేందుకు టైం కేటాయించవచ్చు. కానీ సినిమా నటిగా అయిన తర్వాత మాత్రం ప్రేమించడం కష్టం. బిజీ వల్ల ప్రియుడికి సమయం కేటాయించలేం. ప్రియుడికి సమయం కేటాయించలేనప్పుడు ప్రేమించి మాత్రం ఏమి లాభం? 

ఇక నేను ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కాలం అయింది. ఎందరో హీరోలతో నటించాను. ఇప్పటివరకు నేను హద్దు మీరి ప్రవర్తించింది లేదు. చాలా మంది హీరోలతో నటించినా కూడా నా హద్దుల్లోనే నేనున్నాను. కొందరితో తప్ప ఎవరితోనూ స్నేహంగా మెలగలేదని చెప్పింది. ఇక ఈమె సినిమాలలోకి వచ్చిన రోజుల్లో మెగాబ్రదర్‌ నాగబాబు ఫ్యామిలీలో ఒకరిగా ఉండేది. షూటింగ్‌ సమయాల్లో నాగబాబు ఇంట్లోనే ఉండేది. ఆయన్ను తన ఫాదర్‌ అని కూడా చెప్పుకున్న సంగతి తెలిసిందే...! 

Kajal Agarwal about Her Love:

I have two lovers.. says Kajal Agarwal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ