ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా మరికొన్ని రోజుల్లోనే సెట్స్ మీదకెళ్లనుంది. గత నవంబర్ లోనే పూజ కార్యక్రమాలు జరుపుకున్న వీరి సినిమా ఈ ఏడాది మార్చి నెలాఖరున పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ని లాక్ చేసి త్రివిక్రమ్.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ని చాలా స్టైలిష్ లుక్ కి తీసుకొస్తున్నాడట. ఎన్టీఆర్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కండల్ని కరిగించేస్తున్నాడు. తన సినిమాల్లో హీరోలను ఎప్పుడు క్లాసీ లుక్ లోనే చూపించే త్రివిక్రమ్ ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ ని చాలా క్లాస్ గా స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నాడట.
ఇక స్క్రిప్ట్ వర్క్ తో పాటే నటీనటుల ఎంపిక చేపట్టిన త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్టీఆర్ కి జోడిగా హాట్ గర్ల్ పూజ హెగ్డేని ఎంపిక చేసాడు. మరి మొదటిసారి పూజ తో రొమాన్స్ చెయ్యబోతున్నాడు ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఎంపిక చేసిన విషయము తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ మిగతా నటీనటులను ఎంపిక చేస్తున్న త్రివిక్రమ్.. ఎన్టీఆర్ కోసం విలన్ గా జగపతి బాబు పేరుని పరిశీలిస్తునట్టుగా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ - జగపతి బాబుల కాంబో కి 'నాన్నకు ప్రేమతో' సినిమాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాలో మైండ్ గేమ్ తో ఎన్టీఆర్ - జగపతి బాబులు ఢీ కొట్టిన తీరు అప్పుడే ఇంకా ప్రేక్షకులు మరచిపోలేదు.
మరి మళ్ళీ మరోమారు ఎన్టీఆర్ - జగపతి బాబుల కాంబో అంటే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాకు భారీ అంచనాలు వచ్చెయ్యడమే కాదు.... అందరిలోనూ ఈ కాంబో మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది కూడా.