హీరోయిన్స్ కి పెళ్ళయితే ఇక హీరోయిన్ గా లైఫ్ ఉండదని ఫిక్స్ అయిపోయి... పెళ్లి వయసు దాటిపోయినా పెళ్లిళ్లు చేసుకోకుండా ఇంకా హీరోయిన్స్ కిందే సినిమాలకు అతుక్కుపోయేవారు అన్ని భాషల్లోనూ ఉంటారు. వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి కదా. పెళ్ళైతే ఫిట్ నెస్ తగ్గిపోయి లావయ్యే హీరోయిన్స్ ని మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ఎవరయినా పెళ్లిపేరెత్తగా ఉలిక్కిపడతారు. కానీ మంచి పొజిషన్, టాప్ రేంజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయినా ఆమెకి మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఆమె ఎవరో కాదు నాగ చైతన్యని పెళ్లాడిన సమంత.
ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలని ఎప్పుడూ చెప్పే సమంత తనకి పెళ్లి వయసు రాగానే నాగ చైతన్యని వివాహమాడింది. ఇక పెళ్ళికి ముందు సమంత పొజిషన్ ఏ రేంజ్ లో ఉందో.. పెళ్లైయ్యాక కూడా సమంత అదే క్రేజ్ ని రేంజ్ ని మెయింటింగ్ చేస్తుంది. పెళ్ళై అక్కినేని ఇంటి కోడలిగా మారక కూడా ఎప్పటికప్పుడు తన హాట్ గ్లామరస్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పెళ్లయ్యాక తనేం మారలేదని చెబుతున్న సమంత ఎప్పటిలాగే హాట్ హాట్ గా దర్శనమిస్తుంది. ప్రస్తుతం రంగస్థలంలో డి గ్లామరస్ పాత్రలో రామలక్ష్మిగా ఒదిగిపోయిన సమంత బయటకి ఎక్కడికెళ్లినా హాట్ హాట్ గానే గ్లామర్ షో చేస్తుంది.
నిన్నటికి నిన్న ఒక మొబైల్ షోరూం ఓపెన్ చెయ్యడానికి వచ్చిన సమంత ఒక వెరైటీ డ్రెస్సులో హాట్ హాట్ లుక్స్ తో కనబడడమే కాదు... అసలు సమంతకి పెళ్లయిందా అన్నట్టుగా పర్ఫెక్ట్ ఫిట్నెస్ తో కనబడింది. మరి పెళ్లికి తర్వాత కూడా తాను మారలేదని మరోమారు రుజువు చేసింది సమంత. ఇక పెళ్లి తర్వాత సమంత జోరు మాములుగా లేదు. కోలీవుడ్లో రెండు మూడు సినిమాల్తో బిజీగా వున్న సామ్ తెలుగులో ఆమె నటించిన 'రంగస్థలం' ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా... 'మహానటి' సినిమా రిలీజ్ కి మాత్రం ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదు.