Advertisementt

సితార.. మా అమ్మే: మహేష్!

Thu 15th Mar 2018 09:53 PM
mahesh babu,sitara,grandmother,mother  సితార.. మా అమ్మే: మహేష్!
My Daughter Is Just Like My Mother: Mahesh Babu సితార.. మా అమ్మే: మహేష్!
Advertisement
Ads by CJ

ఎంతటి వారికైనా కన్నబిడ్డలంటే ఎంతో ప్రాణం. వారు కష్టపడేది.. సంపాదించేది అంతా పిల్లల కోసమే కదా...! ఇక ఎవరికైనా పాప, బాబు పుట్టినప్పుడు అచ్చు తమ అమ్మనాన్నల్లా, అంటే బామ్మ, తాతయ్యలలాగా పోలికలు ఉంటే ఆ ప్రేమ మరింత వందరెట్లు పెరుగుతుంది. ఇక విషయానికి వస్తే మహేష్‌బాబుకి ఫ్యామిలీ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్యాప్‌ దొరికిందంటే చాలు తన భార్య, పిల్లలతో విదేశాలలో వాలిపోతాడు. తాను సినిమాలు, యాడ్స్‌ వంటి పలు విషయాలలో బిజీగా ఉన్నా కూడా ప్రొఫెషనల్‌ లైఫ్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తాడో ఫ్యామిలీ లైఫ్‌కి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తాడు. 

ఇక ఆయన శ్రీమతి నమ్రతా కూడా మహేష్‌ బిజీగా ఉంటే ఆయనకి సంబంధించిన పనులు, సేవా కార్యక్రమాలలో తల మునకలైపోతుంది. ఇక మహేష్‌-నమ్రతాల కుమారుడు గౌతమ్‌కృష్ణ అచ్చు తన నాన్నలాగా ఉంటాడని, అందుకే తన మనవడిని వెండితెరపై కృష్ణకి చూపించాలనే తాను '1' (నేనొక్కడినే) చిత్రంలో గౌతమ్‌ చేత పాత్ర వేయించానని చెబుతాడు. కృష్ణ కూడా తన మనవడితో కలసి సినిమాలో నటించాలనే కోరికను కూడా వెల్లడించాడు. 

ఇక ఈయన కూతురు మాత్రం అచ్చు మహేష్‌ వాళ్ల అమ్మ ఇందిరాలా ఉంటుందని ఇప్పటికే మహేష్‌ పలుసార్లు చెప్పాడు. తాజాగా ఆయన ఇదే మాటలను మరలా చెప్పాడు. గులాబి రంగు నేపధ్యంలో సితార ఫొటోని పోస్ట్‌ చేస్తూ, 'పింక్‌ గర్ల్‌ పవర్‌.. అచ్చు మా అమ్మలా కనిపిస్తోంది..' అంటూ క్యాప్షన్‌ పెట్టి తల్లి, కూతుర్ల ఇద్దరి మీద తనకున్న ప్రేమాభిమానాలను మహేష్‌ చాటుకున్నాడు. 

My Daughter Is Just Like My Mother: Mahesh Babu:

Mahesh Babu Thinks Daughter Sitara Looks Like Her Grandmother 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ