Advertisementt

భరత్ గురించి మరో విశేషమేమిటంటే..!

Thu 15th Mar 2018 03:15 PM
bharath ane nenu,song set,annapurna studio,mahesh babu,koratala siva  భరత్ గురించి మరో విశేషమేమిటంటే..!
Wonderful Song Set to Bharath Ane Nenu భరత్ గురించి మరో విశేషమేమిటంటే..!
Advertisement
Ads by CJ

కొరటాల తన మూడు సినిమాలను సూపర్ హిట్ చేయగలిగాడు అంటే... అదంతా ఆయనకున్న టీమ్ బలమే అని ఓపెన్ గానే చెప్పాడు. టీమ్ వర్క్ కరెక్ట్ గా ఉంటే విజయం ఆటోమేటిక్ గా వస్తుందని కొరటాల నమ్మకం. అందుకే మూడు సినిమాలను విజయం దిశగా నడిపించాడు. మిర్చి సినిమా అప్పటినుండి దేవిశ్రీ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుని తనకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలాంటి మ్యూజిక్ ని తీసుకున్నాడు కొరటాల. ఇక కొరటాల మూడు సినిమాలు మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్సే. అందుకే ఇప్పుడు 'భరత్ అనే నేను' కి కూడా దేవీశ్రీని మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ చేస్తున్నాడు.

ఇకపోతే తనకి మూడు సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన మది, తిరు లు కొరటాలకు కావాల్సిన అవుట్ ఫుట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు 'భరత్ అనే నేను'కి కూడా ఆర్కే చంద్రన్, తిరుల వంటి పెద్ద సినిమాటోగ్రాఫర్స్ తో పని చేయించుకుంటున్నాడు కొరటాల. అయితే ఇప్పుడు 'భరత్ అనే నేను' సినిమాలో పాటలు విజువల్ వండర్ గా వుండబోతున్నాయట. 'భరత్ అనే నేను' లో ఒక పాట కోసం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సెట్టు వేసి అక్కడ పాట చిత్రీకరణ జరుపుతున్నారట. మరి అక్కడ వేసిన ఆ సెట్టు కళ్ళు జిగేలుమనే రేంజ్ లో ఉందట. ఇక ఈ పాట చిత్రీకరణ కూడా అదిరిపోయే లెవల్లో జరుగుతోందట.

అన్నపూర్ణ స్టూడియోస్ లో పాట చిత్రీకరణ పూర్తి కాగానే యూకే షెడ్యూల్లో ఇంకో రెండు పాటల్ని... అలాగే కొన్ని సన్నివేశాల్ని కూడా చిత్రీకరిస్తారట. ఇక దీనితో భరత్ అనే నేను షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుందట. మహేష్ సరసన బాలీవుడ్ హాట్ భామ కైరా అద్వానీ నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నాడు.

Wonderful Song Set to Bharath Ane Nenu :

Bharath Ane Nenu Movie Highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ