ఒకే ఒక్క కన్నుగీటుతో సంచలనం సృష్టించి, చివరికి శశికపూర్, అల్లుఅర్జున్ నుంచి రవీనాటాండన్, సాయిపల్లవి, సిద్దార్ద్.. ఇలా అందరి దృష్టిని ఆకర్షించిన సోషల్ మీడియా సంచలనం.. ప్రియా ప్రకాష్ వారియర్. ప్రస్తుతం ఆమె డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. తన ఇంట్లో తల్లిదండ్రులే కాదు.. తన కాలేజీలోని అధ్యాపకులు కూడా ఎంతో కఠినంగా ఉంటారని చెప్పింది. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఇంటర్‌కి వచ్చిన తర్వాత కాలేజీ డేస్‌ని బాగా ఎంజాయ్ చేయవచ్చని భావించాను. కానీ నేను చదివే విమలా కాలేజీలో నిబంధనలు కఠినంగా ఉంటాయి. మోడ్రన్ డ్రస్‌లు వేసుకోకూడదు. మొబైల్స్ కాలేజీలకు తేకూడదు. నేను వన్ ప్లస్ మొబైల్‌కి బ్రాండింగ్ చేయడం వల్ల నా వద్ద ఓ వన్ ప్లస్ మొబైల్ ఉంది. కానీ దానిలో సిమ్ లేదు. నేను ఎప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం ఉన్నా మా అమ్మ గారి ఫోన్ నుంచే ఫోన్ చేయాలనేది మా ఇంట్లో నిబంధన. నన్ను ఇంట్లో కూడా ఫోన్ వాడనివ్వరు. హాట్‌స్పాట్ ఇంట్లో ఆన్‌చేసి ఉంటే మొబైల్ వాడుతాను.
'ప్రింగిల్స్, వన్‌ప్లస్, హిప్‌స్టర్' వంటి బ్రాండ్లకు నా సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నాకు ఓ పోస్ట్‌కి ఐదు లక్షలు ఇస్తారు. నా తొలి విమాన ప్రయాణం ఇటీవలే జరిగింది. మాదక ద్రవ్యాల వ్యతిరేక క్యాంపెయిన్ సందర్భంగా కొచ్చి నుంచి తిరువనంత పురం వెళ్లేందుకు నేను మొదటి సారిగా ఇటీవలే విమానం ఎక్కానని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఈమెకి బాలీవుడ్ నుంచి కోలీవుడ్, టాలీవుడ్, మల్లూవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తున్నాయి. మరి ఆమె 'ఒరు ఆధార్ లవ్' విడుదల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. మరి 'ఒరు ఆధార్ లవ్' తర్వాత ఆమె క్రేజ్ ఇంత కంటే పెరుగుతుందా? తుస్సుమనిపిస్తుందా? లేదా? అనే దానిపై ఆమెకి వచ్చే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.