గత పదిరోజులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి అమెరికా చెక్కేశారు, అది కూడా రాజమౌళితో తియ్యబోయే మల్టీస్టారర్ కోసమే... లేదంటే ఎన్టీఆర్, చరణ్ లు అంత హడావిడిగా అమెరికాకి వెళ్లి రావడమేమిటి అంటూ అనేక రకాలుగా చర్చలు కూడా జరిగాయి. ఇక అక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు రాజమౌళి సినిమా కోసం స్పెషల్ ఫోటో షూట్స్ కోసం మాత్రమే అమెరికా వెళ్లారు అన్నారు. అంతేకాకుండా అక్కడ ఎన్టీఆర్ కి చిన్న యాక్సిడెంట్ జరిగిందని.. ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎన్టీఆర్, చరణ్ లు అమెరికాలో తమ పనులు ముగించుకుని అప్పుడే హైదరాబాద్ కి కూడా చేరుకున్నారు.
అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు అంత హడావిడిగా అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళింది రాజమౌళి కోసమే అట. రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ లతో ఒక బడా మల్టీస్టారర్ ప్లాన్ చేసాడు. అయితే బాహుబలిలో గ్రాఫిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఈ మల్టీస్టారర్ లో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండకుండా కథ మీదే సినిమాని హైలెట్ చెయ్యాలని రాజమౌళి అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో కూడా చిన్నపాటి గ్రాఫిక్స్ ఉంటాయట. మరి గ్రాఫిక్స్ లేకుండా సినిమా ఏమిటి అని ఆలోచించిన రాజమౌళి చరణ్, ఎన్టీఆర్ లను అమెరికా కి పంపి అక్కడ వారిద్దరికీ టోటల్ బాడీ స్కాన్ చేయించాడట.
అందుకే ఎన్టీఆర్, చరణ్ లు ఇలా మినీ టూర్ కి వెళ్లారని అంటున్నారు. ఇక రాజమౌళి ఈ మల్టీస్టారర్ ని సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకి తీసుకెళ్లానని భావిస్తున్నాడట. అందులో భాగంగానే రాజమౌళి ఇలా ఎన్టీఆర్ , చరణ్ ల బాడీ స్కాన్ చేయించి గ్రాఫిక్స్ పనులు మొదలు పెట్టెయ్యడమే కాకుండా.. ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్నాడట.