రన్ రాజా రన్ వంటి ఒకే ఒక్క హిట్ తో దర్శకుడు సుజిత్ కి బాహుబలితో ఒక రేంజ్ హిట్ అందుకున్న ప్రభాస్ 'సాహో' వంటి బిగ్ ప్రాజెక్ట్ ని అప్పగించాడు. మరి బాహుబలితో ఒక టాలీవుడ్ లోనే కాక ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ పేరు సంపాదించుకున్నాడు. మరి బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా ఆ సినిమాపై లెక్కకు మించి అంచనాలుంటాయి. అయితే ఆ అంచనాలు తగ్గట్టుగానే యూవీ క్రియయేషన్స్ వారి 150 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో చిత్రాన్ని భారీగానే సుజిత్ దర్శకత్వంలో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో నిర్మిస్తున్నారు. మరి సాహో మీదున్న అంచనాలతో దర్శకుడు సుజిత్ మీద విపరీతమైన ఒత్తిడి పెంచేస్తుంది.
అయితే చేసిన ఒకే ఒక్క సినిమాని కూడా సుజిత్ చాలా ఈజీగా కామెడీ ఎంటర్టైనర్ గా మలచి సక్సెస్ సాధించాడు. కానీ ఇప్పుడు సాహో విషయం అలా కాదు... హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టెయినర్ గా ఈ సినిమాని మలచాలి. కానీ సాహోను అలా ఈ దర్శకుడు ఎంతవరకు తీర్చిదిద్దగలడన్న డౌట్లు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వినిపిస్తున్నాయి. మరి కేవలం టాలీవుడ్ సినిమాని అయితే ఈజీగా హ్యాండిల్ చెయ్యగలడు కానీ.. ఇలా ఒకేసారి నాలుగు భాషల్లో సినిమాని తీర్చిదిద్దడం అనేది మాత్రం సుజిత్ కి కత్తి మీద సాములాంటిది.
మరి ఇంత ఒత్తిడిలో ఉన్న సుజిత్ పై సాహో భారమంతా మోపితే తాము అనుకున్న రిజల్ట్ రావడం కష్టమని... భావించిన మేకర్స్ ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ మొదలైంది. అలా మేకర్స్ ఇచ్చిన సలహాతో ప్రభాస్, ఇంకా సాహో సినిమాటోగ్రాఫర్ మది సాహో షూటింగ్ విషయంలో మరింతగా ఇన్వాల్వ్ అవడమే కాదు... అక్కడ షూటింగ్ పూర్తవ్వగానే.. క్వాలిటీతో అవుట్ పుట్ వస్తోంది లేనిదీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ముందుకెళుతున్నారని తెలుస్తోంది.