కెరీర్ మొదట్లో మాత్రం కాస్త పద్దతిగా, గ్లామర్‌కి దూరంగా, నటనాపరంగా ప్రాముఖ్యం ఉన్న పాత్రలనే చేసే హోమ్లీ హీరోయిన్లు సైతం ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోతే గ్లామర్‌షోకి సై అంటారు. బికినీ నుంచి ఏ దుస్తులైనా వేసుకోవడానికి నో చెప్పరు. ఇక సోషల్‌మీడియాలో ఫొటో షూట్లు, ఇతర మేగజైన్ కోసం ఫొటోషూట్లలో రెచ్చిపోతారు. ఇదే విషయం రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా నిరూపిస్తోంది. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్ తర్వాత అందులోని హీరో సందీప్‌కిషన్‌కి ఒక్క హిట్ రాకపోయినా ఈమె మాత్రం అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందరు యంగ్ స్టార్స్ సరసన నటించింది. ఇక తన కెరీర్ ప్రారంభంలో ఈమె కాస్త లిమిట్ గానే గ్లామర్‌షో చేసింది. కానీ 'జయజానకి నాయకా, స్పైడర్, అయ్యారీ' చిత్రాల ఫ్లాప్‌తో ఈమెకి అవకాశాలు తగ్గాయి. ముఖ్యంగా 'జయజానకి నాయకా'తో పాటు 'రారండోయ్ వేడుక చూద్దాం'లో కూడా మంచి నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసినా అనుకున్న స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.
దాంతో ఈమె కూడా గ్లామర్‌షో చేస్తూ మేగజైన్ కవర్ పేజీలకు, సోషల్ మీడియాలో హాట్ దుస్తులతో దర్శనం ఇస్తోంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ, మేగజైన్ల కవర్‌పేజీల కోసం ఫొటో షూట్స్ చేయడం అనేది సహజమే. నేను ఒక్కదానినే కాదు అందరు అదే పనిచేస్తున్నారు. ముఖ్యమైన మేగజైన్ల కవర్‌పేజీలలో నన్ను నేను చూసుకోవాలని కోరుకోవడంలో తప్పులేదు. ఇలాంటి ఫొటో షూట్లలో పాల్గొన్న నాకు గానీ నా కుటంబసభ్యులకు గానీ లేని అభ్యంతరం మిగిలిన వారికి ఎందుకు? నచ్చితే చూడండి.. నచ్చకపోతే మౌనంగా ఉండండి. ఈ విషయంలో మిగిలిన వారికి అసహనం అనవసరం. అంతేగానీ నా మీద అసభ్య కామెంట్స్ చేయడం మాత్రం సరికాదు. మితిమీరిన గ్లామర్ ప్రదర్శించడానికి నేను కూడా వ్యతిరేకమే.
నా హద్దులను నేను ఎప్పటికీ దాటబోను అని తన విమర్శకులకు గట్టిగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా సమాజంలో బతుకుతూ నా ఇష్టం నాది అంటే అది వీలు కాదు. దానికి స్వేచ్చ అనే పదం వాడటం కూడా సరికాదు. ఈ లెక్కన ఈ అమ్మడు రాబోయే చిత్రాలలో కూడా తన గ్లామర్‌షోని మరింతగా పెంచడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.