దశాబ్దం కెరీర్‌ని దాటి 50కి పైగా చిత్రాలలో హీరోయిన్‌గా నటించి, అటు మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇటు రామ్‌చరణ్, కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్.. ఇలా కొత్త పాత తరాలన్నింటితో, ముఖ్యంగా నేటి జనరేషన్ స్టార్స్, సీనియర్ స్టార్స్ సరసన కూడా నటించేస్తోంది కాజల్. 'చందమామ, మగధీర'తో స్టార్ హీరోయిన్ అయిన ఈమె తమిళంలో కూడా అజిత్, విజయ్ నుంచి కుర్రహీరోలను కూడా చుట్టేస్తోంది. ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, మా చిన్నప్పుడు సినిమాకి వెళ్లడం అంటే ఒక పిక్నిక్‌గా ఉండేది. సినిమా విడుదలకు కొన్నిరోజుల ముందే టిక్కెట్లు బుక్ చేసుకోవడం, కుటుంబ సమేతంగా అందరం కలిసి మంచి సినిమాకి వెళ్లి ఇంటర్వెల్‌లో సమోసాలు, కూల్‌డ్రింక్స్ తాగుతూ, పిక్నిక్‌లా ఎంజాయ్ చేసేవారం.
నాడు ఉమ్మడి కుటుంబాలు ఉండేసరికి అవి తీపి గుర్తులుగా మిగిలి ఉన్నాయి. మనం కాస్త మారితే ఆ పరిస్థితులు మరలా తెచ్చుకోవచ్చు. ఇక మల్టీప్లెక్స్‌ల వల్ల సినిమాలు మరింత మందికి దగ్గరయ్యాయనే నేను భావిస్తాను. కుటుంబంలోని అందరం కలిసి ఉంటే ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ సాధ్యమే. నాకు కాబోయే భర్త సినిమా వ్యక్తా? బయటి వ్యక్తా? అనేది నాకు తెలియదు. అదేవిధంగా పెళ్లి విషయంలో నాకు సంకుచిత భావాలు లేవు. కానీ నాకు కాబోయే వ్యక్తి చిత్ర పరిశ్రమ కన్నా ఎక్కువ. అయినా పెళ్లి విషయం ఇప్పటి వరకు ఆలోచించలేదు. ఇక నేను సినిమాలకు, నటనకు ప్రాంతీయ భాషా బేధాలు లేవని నమ్ముతాను. ప్రాంతీయ భాషా చిత్రాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలలో నటించేందుకు కూడా నేను సిద్దమే.
నాకు స్క్రిప్ట్, క్యారెక్టర్ నచ్చితే ఏ భాషలోనైనా నటిస్తాను. ప్రస్తుతం నటన తప్ప మరో ఆలోచన లేదు. నిర్మాణం, దర్శకత్వంలోకి వెళ్లే ఆలోచన కూడా లేదు. నాతోటి నటీమణులు అలా ఆ రంగాలలో కూడా రాణించడం చూసి నాకెంతో సంతోషం వేస్తోంది.. అని కాజల్ చెప్పుకొచ్చింది.