మోదీ హవా సాగటం, బిజెపి-టిడిపిలు పొత్తు పెట్టుకోవడం, పవన్ వారికి మద్దతు తెలపడం, కేంద్రంలో మోదీ వస్తే దేశంలో మార్పు, గుజరాత్ తరహా అభివృద్ది వస్తాయని, చంద్రబాబు సీనియర్ కావడంతో కొత్తగా ఏర్పడిన ఏపీ రాష్ట్రానికి ఆయనైతేనే అభివృద్ది చేయగలడనే నమ్మకంతో కిందటి ఎన్నికల్లో బిజెపి-టిడిపి కూటమిని ప్రజలు గెలిపించారు. ఇక చంద్రబాబు, టిడిపిల విషయాన్ని పక్కనపెడితే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వేజోన్ నుంచి పలు ముఖ్య సంస్థలు మోదీ ఏపీకి ఇస్తారని అందరు ఆశపడ్డారు. కానీ మోదీ మాత్రం ఏపీని, ఏపీ ప్రజలను, ఇంకా చెప్పాలంటే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను తీవ్రంగా అవమానించాడు. తనకి గురువు. గుజరాత్ అల్లర్ల సమయంలో కూడా వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించాలని భావిస్తే అద్వానీ మాత్రం తన శిష్యుడైన మోదీని వెనకేసుకుని వచ్చి, ఆయన మంచి పరిపాలనా దక్షుడు.. ఆయనే సీఎంగా ఉంటే బాగుంటుందని బలవంతంగా ఒప్పించాడు.
అలాంటి మోదీ తాజాగా అద్వానీ పైకి లేచి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసినా మోదీ పట్టించుకోకుండా అవమానించాడు. ఇలాంటి కుత్సిక బుద్ది ఉన్న మోదీ ఏపీకి ఏదో చేస్తాడని ఊహించుకోవడం కూడా కష్టమే. మరోవైపు ఇప్పటివరకు వాజ్‌పేయ్ ఎలా ఉన్నాడో కూడా మోదీ జనాలకు, ఓటర్లకు, పార్టీ కార్యకర్తలకు కూడా తెలియనివ్వడం లేదు. ఇలాంటి సమయంలో 1983 నుంచి తాను టిడిపి కోసం పనిచేస్తున్నానని, ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కాడని, పనిచేసిన వారికే గుర్తింపు ఇస్తానని చెప్పే చంద్రబాబు తనని తిట్టిన వారికే పదవులు ఇస్తున్నారని టిడిపి నేత, సినీ నటి కవిత ఘాటుగా విమర్శించిది. తాను టిడిపి నుంచి బయటికి రాలేదని, టిడిపి నుంచి గెంటివేయబడ్డానని అంటోంది.
ఇక ఇటీవల మహానాడు నుంచి పలు చోట్ల ఆమె తనకు ప్రాధాన్యం లేదని ఏడ్చి మీడియాకి ఎక్కింది. ఈ మధ్య టిడిపిపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న ఈమె టిడిపికి రాజీనామా చేసి విజయవాడలో బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చేతి నుంచి కాషాయం కండువా కప్పుకుని బిజెపిలోకి వచ్చింది. మోదీ అభివృద్ది, ఆయన నిబద్దత, సంక్షేమ పథకాల స్ఫూర్తితోనే బిజెపిలో చేరిందట. మరి ఈమె ఏ పార్టీలో ఉన్నా ఆమెకి లభించేది? ఆమెకి ఒనగూరే ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. ఈమె ఎక్కడున్నా ఒక్కటే. ఏ పార్టీలో ఉన్నా తేడాలేదని చెప్పవచ్చు.