ప్రకాష్‌రాజ్‌కి సమయపాలన, క్రమశిక్షణ లేదనే గానీ ఆయనో గొప్పనటుడు. ఈ విషయం ఆయన ఎప్పుడో నిరూపించుకున్నాడు. అయినా షూటింగ్‌లకు సరిగా రాకుండా దర్శక నిర్మాతలను, తోటి నటీనటులను ఎంతో ఇబ్బందిపెడుతుంటాడు. గతంలో ఆయనపై పలువురు దర్శక నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై బ్యాన్‌కూడా విధించారు. అయినా ఆయనకు రావాల్సిన వేషాలు, ఆయన మాత్రమే చేయగలడని భావిస్తున్న పాత్రలు వెత్తుక్కుంటూ ఆయన వద్దకే వస్తున్నాయి. ఇక ప్రకాష్‌రాజ్ గతంలో జర్నలిస్ట్‌గా, మేధావుల సంఘంలో కూడా పనిచేశారు. అలాగే ఆయనకు రచనా వ్యాసంగం, నుంచి పలు విషయాలపై స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ఇటీవల బెంగుళూరులో గౌరీ లంకేష్ హత్య నేపధ్యం నాటి నుంచి మోదీని, బిజెపిని చీల్చి చెండాడుతున్నాడు. గుజరాత్ ఎన్నికలలో తగ్గిన సీట్ల నుంచి బీఫ్ ఫెస్టివల్ వరకు తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు.
కాగా ఇటీవల కన్నడ హీరో, బిజెపి నాయకుడైన ఓ స్టార్ ఇప్పటి వరకు తమిళుల పక్షాన ఉన్నావు. ఇప్పుడు నీకు కర్ణాటక గుర్తుకు వచ్చిందా? రాజకీయాలు మాట్లాడాలని భావిస్తే నీకిష్టమైన తమిళనాడుకి వెళ్లి విమర్శలు చేయమని ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అయినా ప్రకాష్‌రాజ్ ముందుగా భారతీయుడు. ఆయన తమిళనాడు నుంచే కాదు కర్ణాటక, జమ్మూకాశ్మీర్ వరకు ఎక్కడికైనా వెళ్లి తన మనోభావాలు చెప్పే స్వేచ్చ ఆయనకుంది. ఇక తాజాగా కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రకాష్‌రాజ్ వంటి పలు విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి, ముఖ్యంగా మోదీని ఎక్కుబెట్టి విరుచుకుపడుతున్న ప్రకాష్‌రాజ్‌కి కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా పంపాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో ఊపందుకుంది.
ఈ విషయమై పలువురు సాహితివేత్తలు, ఇతర ప్రముఖులు కర్ణాటక సీఎం, కాంగ్రెస్‌నేత అయిన సిద్దరామయ్య దృష్టికి దీనిని తీసుకుని వస్తున్నారు. సిద్దరామయ్య కూడా పార్టీ వారి అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడట. ఇదే జరిగితే కర్ణాటక నుంచి మరో సినీ నటుడు ఎంపీగా రాజ్యసభలో ఆకట్టుకోవడం ఖాయమనే చెప్పవచ్చు.