తెలుగు అమ్మాయి అంజలి కోలీవుడ్ లోకి వెళ్లి వరసగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని చక్కబెట్టుకుంది. అయితే మొదటి నుండి అంజలి కొంచెం బొద్దుగానే కనిపించింది. తెలుగులో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’ వంటి హిట్ సినిమాల్లో చేసింది. ఈ సినిమాల్లో కూడా కొంచెం లావుగానే దర్శనమిచ్చింది.
అయితే తర్వాత అంజలి మరీ లావుగా తయారై ఎబ్బెట్టుగా కనిపించింది. దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అవకాశాలు రావట్లేదు అనే కారణం చేతేనేమో ఉన్నటుంది సన్నగా నాజూకుగా కనిపిస్తుంది. అంజలి కొత్త లుక్ చూస్తే మీకే అర్ధం అవుతుంది.
లేటెస్ట్ గా అద్దం ముందు నిలబడి అంజలి తీసుకున్న సెల్ఫీ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోను చూసినా జనాలు షాక్ తిన్నారు. ఒకేసారి అంజలిలో ఇంత మార్పు వచ్చేపాటికి అందరూ నమ్మలేకపొతున్నారు. మొత్తానికి అంజలి కెరీర్ ముగిసిందనుకుంటున్న టైంలో ఇంత మార్పు చూపించడం ఆశ్చర్యకరం. త్వరలోనే అంజలి ‘గీతాంజలి’ సీక్వెల్ చేయబోతోంది. అయితే ఆ సినిమా కోసమే తగ్గిందా.... లేదా..క్యాజువల్ గానే మార్పు చూపిస్తోందో గానీ.. కారణమేదైనా ఈ మార్పు మాత్రం మంచికే అనడంలో సందేహం లేదు.