Advertisementt

'రంగస్థలం'కి ముహూర్తం ఫిక్స్‌ చేశారు!

Mon 12th Mar 2018 02:31 PM
ram charan,samantha,rangasthalam,pre release,updates  'రంగస్థలం'కి ముహూర్తం ఫిక్స్‌ చేశారు!
rangasthalam pre release Event Date Fixed 'రంగస్థలం'కి ముహూర్తం ఫిక్స్‌ చేశారు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న చిత్రాలలో రామ్‌చరణ్‌-సుకుమర్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'రంగస్థలం 1985' చిత్రం అందరినీ అలరిస్తోంది. ఓ వైపు చెవిటి వాడి పాత్రను చేస్తూ సౌండ్‌ ఇంజనీర్‌ అని హీరో చిట్టిబాబు బాగానే ఆసక్తిని రేపుతున్నాడు. ఇక ఇందులో రామలక్ష్మి పాత్రలో సమంత కూడా అదరగొట్టడం గ్యారంటీ అనిపిస్తోంది. తాజాగా విడుదలైన లిరిక్‌ సాంగ్‌లో హీరో తనని పట్టించుకోవడం లేదనే అర్ధంతో వచ్చే పాటలో ఆమె తన నాభి అందాలను కూడా చూపించింది. 

ప్రస్తుతం రామ్‌చరణ్‌ వైవిధ్యభరితంగా చిత్రాలు చేస్తున్నాడు. ఇక సమంత కూడా అటు గ్లామర్‌ పాత్రలనే కాదు.. ఇలా డీ గ్లామరైజ్‌డ్‌గా ఉండే మాస్‌ పాత్రలను కూడా చేస్తోంది. ముఖ్యంగా పెళ్లి ఫిక్స్‌ అని ఆమె డిసైడ్‌ అయిన తర్వాత 'రాజుగారి గది 2, మెర్సల్, బ్రహ్మూెత్సవం, అ..ఆ, జనతాగ్యారేజ్‌' చిత్రాలలో ఏమాత్రం గ్లామర్‌షో చేయలేదు. ఇక ఈమె అటు పర్ఫార్మెన్స్‌ పాత్రలతో పాటు గ్లామర్ పాత్రల ద్వారా కూడా ఇండస్ట్రీలో పెళ్లయిన తర్వాత జోరు పెంచింది. 

ఇక ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ఈనెల 18వ తేదీన వైజాగ్‌లోని ఆర్కేబీచ్‌లో జరుపనున్నారు. నాటి కాలానికి తగ్గట్టుగా ఈ వేడుకలో బుర్రకథ, డప్పు వాద్యాలు, తప్పెటలతో పాటు దేవిశ్రీ లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ కూడా స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉండనుంది. 

rangasthalam pre release Event Date Fixed:

Rangasthalam Pres Release Event Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ