Advertisementt

ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యిందా..!

Mon 12th Mar 2018 10:13 AM
rakul preet singh,tollywood,bollywood,ayyari movie,karthi,surya  ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యిందా..!
Rakul coming back again to South ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యిందా..!
Advertisement
Ads by CJ

ఉత్తరాది నుంచి వచ్చే హీరోయిన్లు మొదట దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చి తెరంగేట్రం చేయాలని భావిస్తారు. ఎందుకంటే బాలీవుడ్‌ ఎంట్రీకి ముందు వారికి దక్షిణాది మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ చిత్రాలు మెట్లుగా ఉపయోగపడతాయి. ఇదే కోవకి చెందిన ఇలియానా, కాజల్‌, తాప్సి వంటి వారు దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత టాలీవుడ్‌పై విమర్శలు గుప్పింస్తుంటారు. కానీ అక్కడి చిత్రాలు ఆడకపోతే, అవకాశాలు రాకపోతే మరలా దక్షిణాదిలోకి వచ్చి మేము అలా అనలేదు... ఇదంతా మీడియా సృష్టి. మాకు హైదరాబాద్‌ సెకండ్‌ హోం.. తెలుగుకి మించిన ఫీల్డ్‌లేదు. ఇక్కడ క్రమశిక్షణ చాలా ఎక్కువ. తెలుగు చిత్రాలను వదిలేయడం వంటివి జరగవని స్టేట్‌మెంట్స్‌ ఇస్తారు. ఇక ఓ బాలీవుడ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ భామ రకుల్‌ప్రీత్‌సింగ్‌ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' వంటి చిన్న చిత్రాలతో పరిచయమై అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది. 

నేడు కైరా దత్‌, పూజాహెగ్డే. కీర్తిసురేష్‌, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్‌, అను ఇమ్మాన్యుయేల్‌, నివేధాధామస్‌, రాశిఖన్నా వంటి వారి పోటీని తట్టుకోలేకపోతోంది. సంవత్సరం కిందట వచ్చిన 'రారండోయ్‌ వేడుకచూద్దాం' తప్ప 'జయజానకి నాయకా, స్పైడర్‌' చిత్రాలు అమ్మడి కెరీర్‌ని చిన్నాభిన్నం చేశాయి. దాంతో బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ ఏదో సౌత్‌ని కించపరుస్తూ మాట్లాడి, కాళ్లకు బలపం కట్టుకుని తెలుగు చిత్రాలకు కూడా చేయని విధంగా ప్రమోషన్స్‌ చేసింది. కానీ ఈమె నటించిన 'అయ్యారి' చిత్రం ఫ్లాప్‌ అయింది. ఈ చిత్రం ఫ్లాప్‌ అయినా తన నటనకు మాత్రం మంచి ప్రశంసలు లభించాయని చెబుతున్న ఈమె దక్షిణాదిలో తనకు వస్తున్న అవకాశాలు తగ్గిపోయాయనే వార్తలను ఖండిస్తోంది. సినిమాల ఎంపికలో నేను కొన్ని తప్పులు చేశాను. తెలిసి కూడా తప్పులు చేశాను. ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఇలాంటివి తప్పవు. ఒక్కోసారి అలా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని మొహమాటాల వల్ల కూడా తప్పులు జరిగిన మాట వాస్తవమే. 

ఇక నుంచి ఇలాంటి పొరపాట్లు లేకుండా చూసుకుంటానని చెబుతోన్న ఆమె ప్రస్తుతం తమిళంలో కార్తి, ఆయన అన్నయ్య సూర్యల చిత్రాలతో పాటు తెలుగులోనూ ఓ చిత్రానికి ఓకే చెప్పానని చెప్పుకొచ్చింది. అందుకే పెద్దలు చెప్పినట్లు అడుసు తొక్కనేలా... కాలు కడగనేలా అనే సామెత ఈమెకి కరెక్ట్‌గా సూటవుతుంది....! 

Rakul coming back again to South :

Rakul Doing 2 Tamil and 1 Telugu Movie in South

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ