మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రంలో సమంత జమునగా.. కీర్తి సురేష్ సావిత్రిగా..దుల్కర్ సల్మాన్ జెమిని గణేశన్ గా..మోహన్ బాబు ఎస్వీ రంగారావుగా ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి నుండి ఎన్టీఆర్.. ఏఎన్నార్ పాత్రలే అయోమయంగా నెలకొంది.
సీనియర్ ఎన్టీఆర్ పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ ను.. ఏఎన్నార్ పాత్రకు నాగచైతన్యను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఏఎన్నార్ పాత్రకు నాగచైతన్య ఒకే చేశాడు కానీ.. ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించలేదు అని తెలుస్తోంది. ప్రొడ్యూసర్ అశ్వినీదత్ స్వయంగా అడిగినా తారక్ నో అంటే నో అనేశాడు.
అయితే ఎన్టీఆర్ సంగతెలా ఉన్నప్పటికీ తాను ఏఎన్నార్ పాత్రలో కనిపించడానికి చైతూ ఓకే చెప్పాడట. డేట్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. తన తాతలా కనిపించడానికి అతనిప్పుడు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర ఇంకా ఎవరన్నా తీసుకుంటారా.. లేదా ఇంతకు ముందు అనుకున్నట్టు డిజిటల్ రూపంలో ఎన్టీఆర్ ను చూపించి సైడ్ అవ్వుతారా అన్నది చూడాలి ఈ చిత్రం ఈ సమ్మర్ కి మన ముందుకి రానుంది.