Advertisementt

మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

Mon 12th Mar 2018 01:00 AM
vamsi paidipally,mahesh babu,bharat ane nenu,remake  మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
Mahesh Babu Film Is Not A Remake మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు తన 25 వ చిత్రాన్ని బృందావనం, ఊపిరి ఫెమ్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'భరత్ అనే నేను' సినిమా కంప్లీట్ కాగానే మహేష్ బాబు, వంశి పైడిపల్లి సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాని దిల్ రాజు, అశ్వినీదత్ లు నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకెళుతున్న ఈ సినిమా కథపై ఈ మధ్యన వచ్చిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది.

అదేమిటంటే మహేష్ సినిమా కోసం కథని వంశి పైడిపల్లి  ఓ ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి తీసుకున్నాడని న్యూస్ బాగానే స్ప్రెడ్ అయ్యింది. అయితే ఆ న్యూస్ ఆ నోటా ఈ నోటా ఈ వార్త వంశి పైడిపల్లికి చేరింది. అదేమిటంటే వంశి పైడిపల్లి తెరకెక్కిస్తున్న మహేష్ 25 వ సినిమా కథని ఆస్ట్రేలియా సిరీస్‌ నుంచి తీసుకున్నారంటూ న్యూజిలాండ్‌ రచయిత ఒకరు ఈ వార్త ప్రచురించడంతో ఓ అభిమాని వంశీ పైడిపల్లికి ట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్ కి స్పందించిన వంశి ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు.  మహేష్ 25 వ సినిమా కథకి ఏ ఆస్ట్రేలియన్ సీరిసో... లేదంటే మరేదన్నా సినిమా స్పూర్తో కాదని స్పష్టతనిచ్చేశాడు. 

మరి మొన్నటికి మొన్న అజ్ఞాతవాసి విషయంలో ఇలాంటి రచ్చ చాలానే నడిచిన సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ సినిమాని కాపీ కొట్టి సినిమా తీసేసి చివరికి అజ్ఞాతవాసి సినిమా నిర్మాతలు ఆ సినిమా కాపీ రైట్స్ కోసం భారీ మూల్యం చెల్లించాల్సి రావడం ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో. మరి ఇలాంటి సమయంలో వంశి - మహేష్ సినిమా కూడా కాపీ అనేసరికి ... ఆ సినిమా దర్శకుడు వంశి పైడిపల్లి మాత్రం అలాంటిదేం లేదని ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

Mahesh Babu Film Is Not A Remake:

Vamsi Paidipally Clarifies About Mahesh Babu Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ