సౌతిండియన్.. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంతే అని చెప్పాలి. ఇక ఆయన నటునిగా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా డౌన్ టు ఎర్త్‌లా ఉంటారు. తాను ఓ సాధారణ మనిషిలా ఎంతో సింప్లిసిటీ మెయిన్‌టెయిన్ చేస్తారు. సినిమాలలో నటించేటప్పుడు విగ్గు, క్లీన్‌షేవ్‌తో కనిపిస్తారే గానీ నిజజీవితంలో పబ్లిక్ ఫంక్షన్లకు కూడా చింపిరి జుట్టు, తెల్లగడ్డంతో అలాగే వెళతారు. ఇక ఆమధ్య ఆయన బెంగుళూరులోని ఓ దేవాలయంలో ధ్వజస్థంభం పక్కనే మౌనంగా, ధ్యానంలో కూర్చుని ఉండగా, ఓ ధనవంతురాలు వచ్చి గుడి ముందు మెట్లుపై ఉన్న బిక్షగాళ్లకు దానం చేస్తూ, నలిగిపోయిన లాల్చీ, ఫైజమా వేసుకుని చింపిరి జట్టు, గడ్డంలో ఉన్న రజనీని కూడా బిచ్చగాడిలా భావించి పదిరూపాయల నోటుని దానం చేయడం తెలిసిందే. తర్వాత ఆమె బాధపడినా కూడా..... ఇందులో మీ తప్పేం లేదు. నేను సాధారణ బిచ్చగాడినేనని మీరు నాకు జ్ఞానోదయం చేశారని రజనీ అన్నాడు.
ఇక రజనీ తన పేరు ముందు సూపర్‌స్టార్ అనే బిరుదును కూడా వేసుకోవడానికి ఇష్టపడడు. కానీ అభిమానుల ఒత్తిడికి తలొగ్గి ఆ ఒక్క విషయంలో రాజీ పడ్డాడు. దాంతో సినిమాలలో ట్విట్టర్ ఖాతాలలో ఆయన అకౌంట్ ముందు సూపర్‌స్టార్ అనే బిరుదును వాడుతున్నాడు. తాజాగా ఆయన రాజకీయాలలోకి కూడా రావడంతో వెంటనే తన పేరుకు ముందు ట్విట్టర్ ఖాతాలో ఉన్న సూపర్‌స్టార్ అనే పదాన్ని తీసివేశాడు. ఈ బిరుదును రజనీ తొలగించడం తమకు వెలితిగా ఉందని అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నా కూడా రజనీ మాత్రం నిరాడంబరంగా తన బిరుదును ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించాడు. దాంతో ఆయన ట్విట్టర్ ఖాతా సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి కేవలం రజనీకాంత్‌గా మారింది.
ఇక ఈయన 2013లో ట్విట్టర్ ఖాతాలోకి ఎంటర్ అయ్యాడు. తాను కూడా అందరిలాంటి వాడినే అని భావించే ఆయన ఉదారత, సింప్లిసిటీనే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇక ఈయన రాజకీయాలలో బిజీ అయ్యే కొద్ది వాల్‌పోస్టర్స్, బేనర్స్, ఫ్లెక్సీలు, ప్రసంగాలలో ఇతరుల పొగడ్తలలో భాగంగా సూపర్‌స్టార్ అనే బిరుదును వాడుకోవడం కూడా ఆయన వదిలేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు...!