తొలిప్రేమ హిట్ తర్వాత ఆ సినిమా దర్శకుడు వెంకీ పేరు మార్మోగిపోతోంది. అయితే వెంకీ అట్లూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో అఖిల్ అక్కినేని పేరు బాగా వినబడింది అయితే ఇప్పుడు తాజాగా వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో భాగముగా స్టోరీలో చిన్న చేంజెస్ తప్ప స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఇక ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేయటమే. ఆ అనౌన్సమెంట్ ఏమిటంటే.... అఖిల్ అక్కినేనితో తొలిప్రేమ వంటి సూపర్ హిట్ సినిమాను ఇచ్చిన వెంకీ అట్లూరితో సినిమా దాదాపు ఫైనల్ అయినట్లే.
బహుశా ఉగాదికి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వెంకీ అట్లూరితో తొలిప్రేమ సినిమాని నిర్మించిన భోగవిల్లి ప్రసాద్ నే ఈ సినిమాను కూడా నిర్మిస్తారు. హలో సినిమా తర్వాత అఖిల్ చాలా మందితో చేస్తున్నాడు అని టాక్ వచ్చింది. అందులో హీరో ఆది బ్రదర్ సత్య పినిశెట్టితో ఆల్మోస్ట్ సినిమా కంఫర్మ్ అయిందని అందరు అనుకున్నారు. కానీ చివరికి ఆ ప్రాజెక్ట్ పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత సుకుమార్, కొరటాల డైరెక్షన్ లో అన్నారు కానీ...
నిజానికి వెంకీ అట్లూరి 'తొలిప్రేమ' సినిమా కన్నా ముందే ఈ కథ అఖిల్ కి చెప్పాడంట. ఇక వెంకీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్దు కొట్టాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం సులువు అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి..... ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనే వివరాలు తెలియాల్సివుంది.