గురు తర్వాత దాదాపు ఏడాదికి వెంకటేష్... తేజ దర్శకత్వంలో ఆటా నాదే వేటా నాదే సినిమాలో నటిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ లోనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న తేజ - వెంకీల చిత్రం ఈనెలలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ సినిమాలో వెంకటేష్, శ్రియలు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లల తండ్రిగా నటిస్తున్న వెంకటేష్ ఈ సినిమాలో ఎలా వుండబోతున్నాడో అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రే చేస్తున్నాడు. వెంకటేష్ ఈ సినిమాలో ఒక ప్రొఫెసర్ గా నటించనున్నాడు. అయితే ఆ ప్రొఫెసర్ వెంకీ ఎలా వున్నాడో తెలుసా.
అచ్చం ప్రొఫెసర్ ఎలా ఉంటాడో అలానే. కొత్త రకం హెయిర్ స్టయిల్, కొత్తరకం గెడ్డం, అలాగే ఎంతో డీసెంట్ గల వ్యక్తిలాగా.. స్పెట్స్ పెట్టుకుని కోట్ వేసుకుని చేతికి ల్యాప్ టాప్ తగిలించుకుని.. చేతిలోని బుక్స్ తో ఉన్న వెంకీ ప్రొఫెసర్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. మరి గత కొంత కాలంగా వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. గురులో బాక్సింగ్ ట్రైనర్ గా కనబడిన వెంకటేష్ ఆటా నాదే వేటా నాదే లో ప్రొఫెసర్ గా కనబడి హిట్ కొట్టేసేలాగా కనబడుతున్నాడు. మరి తేజ కూడా ఈ సినిమా హిట్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో పాటు తేజ, బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ అనే పెద్ద బాధ్యతను మొయ్యనున్నాడు.