సినిమా నటీనటులకు ముఖ్యంగా స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లను అభిమానించే వారు ఎందరో ఉంటారు. వారి కోసం కటౌట్లు కట్టడం, పాలాభిషేకాల నుంచి ఎన్నో చేస్తుంటారు. వారితో ఫొటోలు దిగాలని, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవాలని ఆరాట పడుతుంటారు. కొందరు వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాదు.. బాగా డబ్బున్న వారైతే వారితో డిన్నర్స్ కూడా చేయాలని ఎంత ఖర్చయినా వెనుకాడరు. వారిని కలిసి ఖరీదైన గిఫ్ట్‌లు ఇస్తుంటారు. అంబానీ సీఈవో జనాలకు తెలియకపోవచ్చు గానీ చిన్న కమెడియన్ కూడా ప్రజలకు బాగా రిజిష్టర్ అవుతారు. ఇక విషయానికి వస్తే బరోడాకి చెందిన నిశి హరిశ్చంద్ర త్రిపాఠి అనే మహిళ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కి వీరాభిమాని. . తన 62 ఏళ్ల వయసులో ఈమె మరణించింది. మరణిస్తూ బరోడాలోని ఓ బ్యాంకులో తన లాకర్‌లో ఉన్న భారీ నగదు, నగలను సంజయ్ దత్‌కి వీలునామా రాసి మరణించింది.
దీంతో బ్యాంకు అధికారుల నుంచి సంజూకి ఫోన్ వెళ్లింది. ఆ నగడు, నగలను తీసుకోవాల్సిందిగా అధికారులు సంజూని కోరారు. ఈ పరిణామం సంజయ్‌దత్‌కే కాదు నిశి బంధువులను కూడా షాక్‌కి గురిచేసింది. ఈ త్రిపాఠి ఎవరో సంజయ్‌కి కూడా తెలియదట. ఆమెని కలిసిన జ్ఞాపకం కూడా లేదంటున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన నిశి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. చట్టపరంగా ఆ ఆస్తులు తనకి వద్దని, వాటిని ఆమె కుటుంబ సభ్యులకే చెందేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంజయ్ డిసైడ్ అయ్యాడు. ఇక అభిమానులు తమ పిల్లలకు హీరో, హీరయిన్ల పేర్లు పెట్టడం, బహుమతులు ఇవ్వడానికి వెంటపడటం చూస్తూనే ఉంటాం. మహా అయితే మొదటి షోని, సినిమా బాగుంటే మరలా మరలా చూసే వారిని చూస్తుంటాం. కానీ నిశి మాత్రం నాకు షాక్ ఇచ్కింది. ఆమెకి చెందిన రూపాయి కూడా నాకు వద్దు అని సంజయ్ అంటున్నాడు. ఇక నటీనటులపై ఎంత అభిమానం ఉన్నా కూడా తమ సొంత పిల్లలు, బంధువులకు తప్ప తమ కష్టార్జితాన్ని ఎవ్వరూ బయటి వారికి ఇవ్వరు.
కానీ ఆమె అలా ఇచ్చిందంటే దానికేమైనా బలమైన కారణం ఉండే ఉంటుంది. వృద్ద వయసులో తన పిల్లలు, బంధువులు ఎవ్వరూ పట్టించు కోకపోవడం కూడా కారణం కావచ్చు. ఇక సంజయ్ నడుపుతున్న డ్రగ్స్ బాధితుల ట్రీట్‌మెంట్‌కి ఆయన చేస్తున్న సేవలు చూసి తన ఆస్థిని కూడా ఆయనకేే చెందాలనేది ఆమె చివరి కోరిక కావచ్చు. కాబట్టి సంజయ్ ఈ ఆస్థిని ఆమెకిష్టం లేని విధంగా పిల్లలకు, బంధువులకు ఇవ్వకుండా ఏదైనా చారిటబుల్ ట్రస్ట్‌కి ఇచ్చి ఉంటే బాగుండేది కదూ.