స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ మల్టీ స్టార్రర్ గా ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రాజమౌళి మొదట 120 కోట్ల బడ్జెట్ అనుకున్నాడు. కానీ బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకుందాం అనుకుంటూ చాలా మంది ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం చూసి మనసు మార్చుకుని 200 కోట్లు దాక బడ్జెట్ పెట్టుకుందాం అనుకుంటున్నాడట.
అయితే నిరాశ పరిచే విషయం ఏంటంటే.. ఈ సినిమా 2019 సమ్మర్ కి విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ 2020 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మొదట 150 వర్కింగ్ డేస్ అనుకున్నారు కానీ అది కాస్త 250 వర్కింగ్ డేస్ కి మారింది.
ప్రస్తుతం రామ్ చరణ్ కెరీర్ చాలా స్లో గా వుంది. ఇటువంటి టైంలో ఏడాదికి ఒక్క సినిమా అయినా తీయాలి. కానీ ఏకంగా దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుంటే ఫ్యాన్స్ గతేంటి? అటు ఎన్టీఆర్ పరిస్థితి కూడా అంతే. రాజమౌళి సినిమా అంటే ఇంత గ్యాప్ ఉండటం సహజం అని కామెంట్స్ చేస్తున్నారు సినీ ప్రేక్షకులు.