అతిలోకసుందరి శ్రీదేవి హఠాన్మరణానికి సామాన్యులు, ఆమెతో ప్రత్యక్ష సంబంధం లేని వారే ఇంతలా బాధపడుతుంటే ఇక ఆమె బిడ్డల సంగతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక బర్త్‌డే అనేది హ్యాపీ మూమెంటే. కానీ తన తల్లి మరణించిన కొన్నిరోజుల్లోనే ఆమె పెద్దకూతురు జాన్వి 21వ బర్త్‌డే వేడుకలు వచ్చాయి. ౨౦ ఏళ్లుగా తన తల్లి సమక్షంలో ఎంతో సంతోషంగా, గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బర్త్‌డేని జాన్వి తాను 21వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని ఎంతో సింపుల్‌గా ముంబైలోని ఓ వృద్దాశ్రమంలో జరుపుకుంది. వృద్దుల మద్య కేక్‌ని కట్ చేసింది. ఈమె 21వ ఏట ప్రవేశించడమే కాదు.. ఇప్పుడు ఖుషీకి అక్కగా మరింత భరోసాని ఇవ్వాల్సిన బరువు బాధ్యతలు ఆమెపై ఉన్నాయి.
ఇక ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన వేడుకలో జరుపుకుంది. శ్రీదేవి మరణం బాధ నుంచి బయటికి పడేందుకు కపూర్ ఫ్యామిలీ ఎంతో ప్రయత్నిస్తోందని దీనిని బట్టే తెలుస్తోంది. బయటి వారిని ఎవ్వరినీ ఆహ్వానించకుండా తన కపూర్ ఫ్యామిలీ ముఖ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈమె ఈ వేడుక జరుపుకుంది. ఈ పార్టకి హాజరైన సోనమ్ కపూర్ ఈ వేడుక ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కపూర్ అండ్ డాటర్స్ పేరుతో ఈ ఫొటోని ఆమె పోస్ట్ చేసింది.
ఇందులో జాన్వి, ఖుషీ, బోనీకపూర్ మొదటి భార్య మోనాకపూర్ కుమార్తె అన్షుల్లా కపూర్‌ల ఫొటోలు కేక్‌ల మధ్య దర్శనం ఇచ్చాయి. బోనీకపూర్ దగ్గర ఉండి జాన్వి చేత కేక్ కట్ చేయించాడు. ఈ వేడుకలో బోనీతో పాటు జాన్వి, ఖుషీ, అన్షుల్లా, సోనమ్ కపూర్, జహాన్ కపూర్, షనయా కపూర్, రియాకపూర్‌లు తదితరులు పాల్గొన్నారు.