జగన్‌కి తనకి తెలియదు.. ఇతరులు చెబితే వినే రకం కాదు. ఇక తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత రాజధాని ఎక్కడ అనే ప్రశ్న చాలా మందిలో ఉదయించింది. నాడు రెండు మూడు ఆప్షన్స్ కనిపించాయి. కర్నూల్, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, గుంటూరు, కృష్ణాలకు చెందిన వెలగపూడి వద్ద అమరావతి. ఇక చంద్రబాబు అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుందని, ఆల్‌రెడీ విజయవాడ, గుంటూరులు బాగా అభివృద్ది చెంది ఉండటంతో ఆయన అమరావతిని రాజధానికి ఎంపిక చేశాడు. ఒక వైపు దొనకొండలో 50వేల ఎకరాల అటవీ భూమి ఉన్నదని, అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం వంటి ఖర్చు తగ్గేదని, ఇక అమరావతిలో భూమి భారీ కట్టడాలకు అనువైన ప్రాంతం కాదని కేంద్రకమిటి సిఫార్సు చేసినా చంద్రబాబు మాత్రం తమ సామాజిక వర్గం పెత్తనం అధికంగా ఉండి, తమ పచ్చ చొక్కా తమ్ముళ్లు అందరు అమరావతి చుట్టుపక్కల భూములను కొని ఉండటంతో అమరావతిని ఫైనల్ చేశాడు.
మరోవైపు దొనకొండ రాజధాని అవుతుందని, జగన్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులు అక్కడ భూములు కొన్నారనేది కూడా వాస్తవం. ఇక రాజధాని ఎలాగూ అమరావతి అని ఫిక్స్ అయింది కాబట్టి దానిని మరలా ప్రస్తావించి, వివాదం చేస్తే జగన్‌కే నష్టం. ఎందుకంటే అమరావతి క్యాపిటల్‌గా డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆయన అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడితే అసలే గుంటూరు, కృష్ణా జిల్లాలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న వైసీపీ పట్ల ఆ రెండు జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ జగన్ మాత్రం ఇది గమనించలేదు. ఆయన ప్రకాశం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా దొనకొండని క్యాపిటల్ చేయకుండా జిల్లాని చంద్రబాబు మోసం చేశాడని అన్నాడు. ఇది తాత్కాలికంగా ప్రకాశం జిల్లా వారికి తృప్తినిస్తుందే గానీ గుంటూరు, కృష్ణా జిల్లాలపై వైసీపీ ఆశ వదులుకోవాల్సిన స్థితి వస్తుందని చెప్పవచ్చు.