ఈ మధ్య మన స్టార్స్ చిత్రాల హైప్‌లు క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఇంపాక్ట్, స్టంపర్లు, టీజర్లు, ట్రైలర్స్, పోస్టర్స్, ప్రీరిలీజ్ ఈవెంట్, సోషల్ మీడియాలో లిరికల్ సాంగ్స్ నుంచి మేకింగ్ వీడియోల వరకు హంగామా చేస్తున్నారు. సినిమాలో కంటెంట్ బాగా ఉంటే ఇలాంటి ప్రమోషన్స్ వల్ల చిత్రాలు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకునే చాన్స్‌లు బాగానే ఉన్నాయి. కానీ కంటెంట్ లేకపోతే మాత్రం 'సర్దార్‌గబ్బర్‌సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, బ్రహ్మూెత్సవం, స్పైడర్, పైసావసూల్'లా మిగిలిపోతున్నాయి. దీంతో కొన్నిసార్లు ప్రమోషన్స్, హైప్ అనేవి ఎంతలా ఉపయోగపడతాయో కొన్నిసార్లు మాత్రం బోల్తా కొడతాయి.
ఇక ఇటీవల కాలంలో సినిమా యూనిట్టే అందులోని స్టార్స్ లుక్స్‌ని లీక్ చేసే పిక్స్‌ని, లీకేజీ అంటూ టీజర్ల నుంచి కొన్నింటిని వదిలేసి జనాలు తమ చిత్రం గురించి ఎలాగోలా మాట్లాడుకునేలా, ప్రమోషన్ జరిగేలా, ప్రచారం జరిగి, వైరల్ అయ్యేలా చేస్తున్నారు. 'అత్తారింటికి దారేది నుంచి బాహుబలి' వరకు ఇదే స్ట్రాటిజి. ఇక తాజాగా శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీజాక్సన్‌లు నటిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలోనే ఎవ్వరూ ఖర్చు చేయని బడ్జెట్‌తో '2.0' చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడుతున్న ఈ చిత్రం విడుదల జనవరి 25న అన్నారు. తర్వాత ఏప్రిల్ 27 అని చెప్పారు. ఇప్పుడు ఆగష్టు లేదా దీపావళి అని వినిపిస్తోంది. మరోవైపు ఏప్రిల్ 27న రజనీ 'కాలా'గా రావడానికి రెడీ అయ్యాడు. అనుకున్న రేంజ్‌లో కాలాపై అంచనాలు గానీ బిజినెస్ గానీ జరగడం లేదు. ఇంతలో '2.0'కి సంబంధించిన ఓ టీజర్ లీకై సంచలనం సృష్టిస్తోంది.
దీనిపై వర్మ స్పందించాడు. శ్రీదేవి మరణం తర్వాత కాస్త కోలుకున్న ఈయన పూర్తిగా సిద్దంకాని ఈ వీడియోను చూస్తుంటేనే ఇంత థ్రిల్లింగ్‌గా ఉంది. లీక్ కారణాలు ఏమైనప్పటికీ లీకైన ఈ టీజర్‌లోని దృశ్యాలు అద్భుతమని చెప్పాడు. పూర్తిగా సిద్దం గానీ సన్నివేశాలే మతులను పోగొడుతున్నాయి.. అద్భుతం అని ట్వీట్ చేశాడు. మొత్తానికి '2.0' కోరుకుంది కూడా ఇదే. వారి కోరిక ప్రకారమే ఇప్పుడు దీనికి బ్రహ్మాండమైన మైలేజ్ వస్తోంది.