Advertisementt

చరణ్, ఎన్టీఆర్.. ఎయిర్ పోర్ట్ లో.. !

Wed 07th Mar 2018 11:26 PM
ram charan,ntr,rajamouli movie,airport  చరణ్, ఎన్టీఆర్.. ఎయిర్ పోర్ట్ లో.. !
Ram Charan and NTR at Airport చరణ్, ఎన్టీఆర్.. ఎయిర్ పోర్ట్ లో.. !
Advertisement
Ads by CJ

గత వారం రోజుల నుండి రాజమౌళి మల్టీస్టారర్ లో నటించబోయే  మెగా, నందమూరి స్టార్ హీరోలైన రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు యూరప్ ట్రిప్ కి రాజమౌళి వర్క్ షాప్ కోసం వెళ్ళబోతున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఇండస్ట్రీలోని ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాని చేస్తున్న రాజమౌళి కోసం ఆ ఇద్దరు హీరోస్ వర్క్ షాప్ కోసం విదేశీ ట్రిప్ కి రెడీ అయ్యారట. కేవలం రెడీ అవడమే కాదు ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి అమెరికాకి చెక్కేశారని ప్రూప్స్ కూడా దొరికేశాయి. ఇప్పటికే వీరిద్దరూ కలిసి అమెరికా చెక్కేశారు కూడా. మరి వీరిద్దరిని ఎయిర్ పోర్ట్ లో చూసిన అందరూ రాజమౌళి సినిమా కోసమే అమెరికాకి వెళుతున్నట్టుగా ప్రచారం చేసేస్తున్నారు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరు  తమ తమ బ్యాగ్స్ తో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలిసి కనబడేసరికి ఇంతకుముందు వచ్చిన న్యూస్ లు అన్ని కరెక్ట్ అని.... రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరు మల్టీస్టారర్ సినిమా కోసం రాజమౌళి ఏర్పాటు చెయ్యబోయే వర్క్ షాప్ కోసం అమెరికాకి ఎగిరిపోతున్నారని దాదాపుగా ఫిక్స్ అయ్యారు. మరి తమ కొత్త ప్రాజెక్ట్ ల విషయాన్ని పక్కన పెట్టేసి మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు రాజమౌళి కోసం వీలైనంత సమయాన్ని కేటాయించడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నా... తమ న్యూ ప్రాజెక్ట్ ల షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా సమయం ఉన్నందు వల్లనే ఇలా ఇద్దరు కలిసి అమెరికా వెళ్లారనే వాళ్ళు లేకపోలేదు.

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఈ నెలాఖరు నుండి సెట్స్ మీదకెళుతుంటే... రామ్ చరణ్ 'రంగస్థలం' షూటింగ్ పూర్తి చేసుకుని బోయపాటి సినిమా కోసం సమాయత్తమవుతున్నాడు. ప్రస్తుతానికి చరణ్ - బోయపాటితో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. ఈ సెకండ్ షెడ్యూల్ కూడా ఈ నెలలోనే మొదలవుతుందనే సమాచారం వుంది. ఇక ఈ గ్యాప్లోనే ఆ మల్టీస్టారర్ స్టోరీ సిట్టింగ్ కోసం ఈ హీరోలిద్దరు ఫ్లైట్ ఎక్కేశారు.

Ram Charan and NTR at Airport:

Ram Charan and Jr NTR in Airport for Rajamouli's film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ