ఇటీవలే అతిలోకసుందరి శ్రీదేవి మరణ వార్తను ఇంకా బాలీవుడ్ పరిశ్రమ మర్చిపోక ముందే బాలీవుడ్‌కి మరో షాక్ తగిలింది. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సీనియర్ నటి షమ్మి మరణించింది. ఈమె వయసు రీత్యా వచ్చే అనారోగ్యంలో భాగంగా తన 89వ ఏట మరణించింది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ కోస్లా వెల్లడించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా షమ్మి మృతిపై స్పందించాడు. షమ్మి ఆంటీ ఎంతో మంచి నటి. మంచి మనసున్న వ్యక్తి. ఎన్నో ఏళ్లపాటు నటిగా రాణించారు. మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని స్పందించాడు.
కమెడియన్‌గా షమ్మి ఎంతో పేరు తెచ్చుకున్నారు. 200లకి పైగా చిత్రాలలో నటించారు. 'హమ్ సాత్ సాత్ హై, గోపీకిషన్, హమ్, కూలీనెంబర్1' వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. ఇక టీవీ సీరియల్స్‌లో కూడా ఆమె నటించిన 'జబాన్ సంభాల్‌కే, శ్రీమాన్ శ్రీమతి, కభీ ఏ కభీ ఓ' వంటి హిట్స్‌లో నటించారు. ఇక ఈమె అసలు పేరు నర్గీస్. బాలీవుడ్‌లో తల్లి, బామ్మ పాత్రలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఈమె ఆరు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారు. ఈమె బాలీవుడ్‌లో బాగా షమ్మి ఆంటీగా పేరు తెచ్చుకున్నారు. షమ్మి రబడి ఎక్కువగా కామెడీ పాత్రల ద్వారా పాపులర్ అయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనమూ ప్రార్ధిద్దాం.