Advertisementt

‘అహంబ్రహ్మాస్మి’ కి మళ్లీ హీరో మారాడు..!

Tue 06th Mar 2018 10:34 PM
bala krishna,krish,aham brahmasmi,next movie  ‘అహంబ్రహ్మాస్మి’ కి మళ్లీ హీరో మారాడు..!
Balakrishna Says Aham Brahmasmi ‘అహంబ్రహ్మాస్మి’ కి మళ్లీ హీరో మారాడు..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణకి 100 వ చిత్రాన్ని డైరెక్ట్ చేసి 'గౌతమిపుత్ర శాతకర్ణి' గా హిట్ అందించిన క్రిష్ ప్రస్తుతం బాలీవుడ్ లో కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో 'మణికర్ణికా' సినిమా చేస్తున్నాడు. మరి ఆ సినిమా ఆగస్టులో పూర్తి కాగానే క్రిష్ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరితో 'అహంబ్రహ్మస్మి' అనే టైటిల్ తో ఒక సినిమాని తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు. అయితే మణికర్ణికా కంప్లీట్ కాగానే క్రిష్ టాలీవుడ్ స్టార్  హీరోలలో ఒకడైన అల్లు అర్జున్ తో 'అహంబ్రహ్మస్మి' సినిమా చేస్తున్నాడని నిన్నటివరకు వినబడిన టాక్. అయితే తాజాగా బాలకృష్ణకి 100 వ చిత్రం 'గౌతమిపుత్ర' తో సూపర్ హిట్ అందించినట్లుగానే ఇప్పుడు కూడా 'అహంబ్రహ్మస్మి' తో మళ్ళీ బాలయ్యకి హిట్ అందించాలని అనుకుంటున్నాడట.

మరి చారిత్రాత్మక చిత్రంతో ఒక్కటైన బాలయ్య - క్రిష్ లు మళ్ళీ ఇప్పుడు ఇలా 'అహంబ్రహ్మస్మి'తో ఒక్కడవడం అంటే ఆ కాంబినేషన్ మీద అంచనాలు మాములుగా ఉండవు. మరి బాలకృష్ణ ప్రస్తుతానికి తన తండ్రి బయోపిక్ ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. ఆ ఎన్టీఆర్ బయోపిక్ ఈనెల 29 న సెట్స్ మీదకెళుతుందని బాలయ్యే స్వయంగా చెప్పాడు. మరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా పూర్తి అయ్యాకనే క్రిష్ తో బాలయ్య 'అహ్మంబ్రహ్మస్మి' సినిమా  చేస్తాడన్నమాట. సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి నిర్మాణంలో బాలకృష్ణ - క్రిష్ ల కాంబోలో 'అహంబ్రహ్మస్మి' సినిమా ఉంటుందన్నమాట.

Balakrishna Says Aham Brahmasmi:

Balakrishna In Krish's Aham Brahmasmi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ