Advertisementt

ఎన్టీఆర్ అభిమానికి చరణ్ సెల్ఫీ..!

Tue 06th Mar 2018 09:58 PM
ram charan,jr ntr,fan,selfie,airport  ఎన్టీఆర్ అభిమానికి చరణ్ సెల్ఫీ..!
NTR's Fan Experienced Charan's Simplicity ఎన్టీఆర్ అభిమానికి చరణ్ సెల్ఫీ..!
Advertisement
Ads by CJ

ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ హీరోస్ ఇద్దరు కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చెయ్యడం అనేది శుభపరిణామమే. ఇదివరలో కూడా వెంకీ, మహేష్ లు కలిసి ఒకే సినిమాలో నటించినప్పటికీ... అప్పట్లో సీనియర్ హీరోతో, స్టార్ హీరో సినిమాలనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని చూశారు కానీ... అదో పెద్ద మల్టీస్టారర్ అన్నంత క్రేజ్ రాలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మల్టీస్టారర్ అనగానే ఆ సినిమాపై ఎక్కడలేని అంచనాలు పెరిగిపోయాయి. మరి ఇద్దరు సమానమైన హీరోలు ఒకే సినిమాలో చేస్తున్నారు అంటే ఆ హీరోల అభిమానులు తమ హీరోలు ఆ సినిమాలో ఎలా వుంటారో అనే క్యూరియాసిటీ ఉండడమే కాదు..... తన అభిమాన హీరో రోల్ కొద్దిగా తక్కువైనా తెగ ఉడికి పోతారు.

హీరోలు తామెంత స్నేహంగా ఉన్న... బయట అభిమానులు మాత్రం మా హీరో ఎక్కువ అంటే మా హీరో ఎక్కువ అంటూ కొట్టుకు చస్తారు. ఇక కొంతమంది అభిమానులైన కాకపోయినా ఒక హీరో పబ్లిక్ లోకొచ్చాడు అంటే  చాలు అతనితో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి... అలాగే అతనితో ఒకే ఒక్క ఫోటో కోసం ఆరాటపడుతుంటారు. అయితే అందుకు కొంతమంది హీరోలు ఇంట్రెస్ట్ చూపక పోయినా.. మరికొంతమంది హీరోలు మాత్రం అభిమానులతో ఫొటోస్ దిగడానికి...వారితో ఇంటరాక్ట్ అవడానికి ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే వారిని ఇంతటి వాళ్ళని చేసింది ఆ అభిమానులే కాబట్టి.

మరి ఒక హీరో అభిమానులు మరో హీరోను చూసినప్పుడు కాస్త ఈర్ష్య వేసిన అతనితో ఫోటో దిగే అవకాశం వస్తే ఏమాత్రం వదులుకోరు. అలాగే ఆ హీరో కూడా వేరే హీరో అభిమానులతో కాస్త కలిసిపొతే అది పెద్ద సెన్సేషనే. ఈ మధ్య ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అదేమిటంటే.. రామ్ చరణ్ ఈమధ్యన ఎయిర్ పోర్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో కలిసి ఒక సెల్ఫీ దిగాడు. అది ఇప్పుడు సెన్సేషన్ అయ్యి కూర్చుంది. రామ్ చరణ్, ఉపాసనలు హాలిడే ట్రిప్ ముగించుకుని ఫ్లైట్ దిగి ఎయిర్ పోర్ట్ లోకి రాగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు చరణ్ దగ్గరికి వచ్చి ఒక్క సెల్ఫీ సర్ అనగానే చరణ్ తన అలసటని పక్కన పెట్టి మరి ఎన్టీఆర్ అభిమానితో సెల్ఫీ తీసుకున్నాడు. మరి చరణ్, ఎన్టీఆర్ లు ఎంతమంచి స్నేహితులో వేరే చెప్పక్కర్లేదు. మరి అలా రామ్ చరణ్ తో దిగిన సెల్ఫీని ఎన్టీఆర్ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడది సెన్సేషన్ అయ్యింది.

NTR's Fan Experienced Charan's Simplicity:

Ram Charan impressed NTR fan in an Airport  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ