కాజల్ అగర్వాల్ తనకు సినిమాల్లో లైఫ్ నిచ్చిన డైరెక్టర్ కోసం రానాకి జోడిగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించింది. మరి ఆ సినిమాలో రానాకి జోడిగా కాజల్ ఎలా వుంటుందో అనే అనుమానం అందరిలో ఉన్నా.. సినిమాలో రానాకి కాజల్ కి మధ్య క్రియేట్ అయిన కెమిస్ట్రీ మామూలుది కాదు. సినిమా మొత్తం కాజల్ అగర్వాల్ చుట్టూనే తిరుగుతుంది. అలా రాధా జోగేంద్రగా కాజల్ కి ఆ సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్ ఇలా చిన్న హీరోలతో నటిస్తుంది అంటే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే.
అయితే కాజల్ మాత్రం తాను నటించే సినిమాల్లో ఎలాంటి హీరో పక్కన నటించిన తన పాత్రకి మాత్రం తగిన న్యాయం చేస్తోంది. ఇప్పుడు కూడా తన మొదటి సినిమా హీరో కళ్యాణ్ రామ్ తో కలిసి కాజల్ 'ఎమ్యెల్యే' సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమా ఫొటోస్, పోస్టర్స్, సాంగ్స్ లోను కాజల్, కళ్యాణ్ రామ్ ల జంట మధ్యలో కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఉంది. వారిద్దరి మధ్యన మాంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉండేలా కనబడుతుంది. మరి కళ్యాణ్ రామ్ పక్కన చందమామ ఎలా ఉంటుందో.. అనుకునే వారికి హీరో కళ్యాణ్ రామ్ కూడా రొమాంటిక్ గా అందమైన కుర్రాడిలా కనబడుతున్నాడు.
కాజల్, కళ్యాణ్ రామ్ ల జంట 'ఎమ్యెల్యే' సినిమాలో అదిరిపోయే రొమాంటిల్ యాంగిల్ లో కనబడుతున్నారు. మరి ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఉపేంద్ర మాధవ్ డైరెక్షన్ లో కాజల్, కళ్యాణ్ రామ్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కాజల్ తన మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణంలో కళ్యాణ్ రామ్ తో జోడి కట్టి.. మళ్ళీ ఇన్నాళ్లకు తన మొదటి హీరో కళ్యాణ్ రామ్ తో 'ఎమ్యెల్యే' సినిమాలో కలిసి నటిస్తోంది. మరి లక్ష్మీ కళ్యాణం అప్పట్లో పెద్దగా హిట్ కాలేదు గాని.. ఇప్పుడు ఎమ్యెల్యే మాత్రం హిట్ అయ్యే సూచనలు బాగానే ఉన్నాయి.