రవితేజ టచ్ చేసి చూడు సినిమాతో కాస్త దెబ్బతిన్నా వెంటనే... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో 'నేల టిక్కెట్' సినిమాని మొదలు పెట్టేశాడు. ఈ సినిమాలో రవితేజకి జోడిగా మాళవిక శర్మ అనే కొత్త అమ్మాయి నటిస్తోంది. ఆ అమ్మాయి బబ్లీగా చూడముచ్చటగా టాలీవుడ్ కి బాగానే కనెక్ట్ అయ్యేలాగే కనబడుతోంది. అయితే ఆ సినిమా షూటింగ్ అలా మొదలయ్యిందో లేదో... ఇలా రవితేజకు గాయాలు అయ్యాయని ఒకసారి.... కాదు కాదు హీరోయిన్ మాళవిక శర్మకి షూటింగ్ స్పాట్ లో దెబ్బలు తగిలాయనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ఇక అలా ఆ వార్తలు అటు సోషల్ మీడియాలోనూ, ఇటు వెబ్ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి.
అయితే ఒకరోజు ఉన్నట్టుండి హీరో రవితేజ తన సోషల్ మీడియా పేజీలో ఎవరికీ ఏమి కాలేదని.... అలా నేల టిక్కెట్ షూటింగ్ లో ఎవరికో గాయాలయ్యాయనే వార్తలన్నీ అబద్దమని పోస్ట్ చేశాడు. అయితే రవితేజ అలా పోస్ట్ చేసిన కొద్ది రోజులకే మాళవిక శర్మ కాలికి కట్టుకట్టించుకుని వీల్ చైర్ లో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఆ పిక్ ని పోస్ట్ చేసింది హీరోయిన్ మాళవిక శర్మ నే. దీనితో ఆ కొత్త హీరోయిన్ కి 'నేల టిక్కెట్' షూటింగ్ లో గాయమైందని స్పష్టమైంది. అయితే షూటింగ్ లో ఎవరికీ ఏం కాలేదని చెప్పి ఇలా ఆ అమ్మాయి కాలికి దెబ్బ తగిలిన పిక్స్ చూస్తే బాగుండదనుకున్నారో ఏమో.. వెంటనే మాళవిక శర్మని పిలిచి అలా దెబ్బ తగిలిన పిక్ ని ఎందుకు పోస్ట్ చేశావంటూ 'నేల టిక్కెట్' బ్యాచ్ కోప్పడడమే కాదు.. ఆ అమ్మాయి పోస్ట్ చేసిన ఆ పిక్ ని సోషల్ మీడియా నుండి తీయించేశారట.
మరి ఆ పిక్ ని మాళవిక శర్మ పోస్ట్ చెయ్యడంతో 'నేల టిక్కెట్' టీమ్ అబద్దం చెప్పినట్టు అవుతుందని... అలా మాళవిక శర్మని పిలిచి ఆ పిక్ ని వెంటనే తీసెయ్యమన్నట్లు ఉన్నారు. అయితే మరి అలా ఆ పిక్ ని వాళ్ళు డిలీట్ చేయించేలోపే ఎంత డ్యామేజ్ జరగాల్సిందో అంత జరిగిపోయింది. ఎందుకంటే మాళవిక శర్మ కాలికి దెబ్బ తగిలి వీల్ చైర్ లో ఉన్న ఆ పిక్ ఎంతగా వైరల్ అవ్వాలో అంతలా అయ్యి కూర్చుంది మరి.