డైరెక్టర్ శంకర్ రోబో 2.0 ఎప్పుడు రిలీజ్ చేస్తాడో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ ఎప్పుడో అయిపోయింది . కానీ ఇంతవరకు రిలీజ్ డేట్ మాటే ఎత్తట్లేదు. వారాలు నెలలు గడిచిపోతున్నాయో సినిమా ఎంతవరకు వచ్చిందో చెప్పడు. పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో చెప్పడు. ఏమైనా అంటే గ్రాఫిక్స్ వల్ల లేట్ అవుతుంది అంటాడు. ఎంత గ్రాఫిక్స్ ఐన మరి ఇంత లేటా.. సౌత్ మొత్తం వినిపిస్తున్న మాటిది. ఇప్పుడు వీటన్నింటికి ఓ ఆన్సర్ ఇచ్చాడు డైరెక్టర్ శంకర్.
లేటెస్ట్ గా 2.0 విఎఫ్ ఎక్స్ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అందులో సినిమాకు సంబందించి గ్రాఫిక్స్ ఎలా చేస్తారో చూపించారు. శంకర్..విలన్ అక్షయ్ కుమార్ తో పాటు టెక్నికల్ టీంలోని ముఖ్యమైన వాళ్లు గ్రాఫిక్స్ చేస్తున్న థర్డ్ ఫ్లోర్ కంపెనీలోని నిపుణులు ఈ సినిమాను ఎంత రిచ్ గా తెరకెక్కిస్తున్నారో చెప్పుకొచ్చారు. అలానే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో వుంటాయో ఇందుకోసం ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు ఇలా అన్ని వివరాలు చెప్పుకొచ్చారు.
సినిమాలో మీకు గ్రాఫిక్స్ చూసినట్టు ఉండదు అవి కథలో భాగమే అని చెప్పారు శంకర్. అలానే సినిమాలో గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి అని అన్నారు. 2.0 సినిమాతో పోల్చుకుంటే రోబో సినిమా జస్ట్ టీజర్ లా ఉంటుందని ఓ టెక్నీషియన్ అన్న మాట నిజమే అనిపిస్తుంది.