తెలుగులో దిల్ రాజు రేంజ్ ఏంటో తెలుసు. కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పుడు సౌత్ లో గుర్తింపు కోసం తహతహలాడుతున్నాడు. అందులో భాగంగానే శంకర్ డైరెక్షన్ లో ఇండియన్- 2 అనే ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశాడు. కానీ మళ్ళీ నేను ఆ సినిమాను నిర్మించట్లేదని తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తన కన్ను ఇంకో పెద్ద దర్శకుడుపై పడింది.
ఆయనే స్టార్ డైరెక్టర్ మణిరత్నం. మణిరత్నంతో దిల్ రాజు ఓ మెగా మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇదొక మల్టీ స్టారర్ మూవీ అని తెలుస్తుంది. ఈ సినిమాలో తెలుగు, తమిళ్ లో యంగ్ హీరోస్ నటిస్తున్నారని వినికిడి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మెగా ఫ్యామిలీ నుండి ఓ హీరోను ఇందులో తీసుకోనున్నాడట దిల్ రాజు.
చరణ్ లేదా.. వరుణ్ ని తీసుకోవాలని దిల్ రాజు ఆలోచన. గతంలో చరణ్ తో మణిరత్నం ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు చరణ్ దీనిని ఒకే చేస్తాడో లేదో చూడాలి. మరో పక్క దిల్ రాజు - మణిరత్నం కాంబినేషన్ పై అనుమానాలు వున్నాయి. దిల్ రాజు తన సినిమాలో వేలు పెట్టాల్సిందే. ఇలాంటివి మణిరత్నంకి మరి ఏం చేస్తాడో చూడాలి. దిల్ రాజు ఇండియన్-2 ప్రాజెక్ట్ నుంచి దిల్ రాజు డ్రాప్ అవ్వడానికి కూడా ఇదే కారణం.