డీజే చిత్రంతో హీరోయిన్ గా నిలదొక్కుకున్న హాట్ భామ పూజ హెగ్డే... దువ్వాడ జగన్నాథంలో గ్లామర్ షో చేసినందుకు బాగానే వర్కౌట్ అయినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే డీజే తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సాక్ష్యంలో నటిస్తున్న పూజ హెగ్డే ఆ సినిమాకి కోటిన్నర అందుకుంటుందనే టాక్ ఉంది. కేవలం శ్రీనివాస్ పక్కన కోటిన్నర ఛాన్స్ మాత్రమే కాదు... సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన వంశి పైడిపల్లి డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. మరి డీజే తో అదృష్టం తన్నుకొచ్చిన పూజ కి ఇప్పుడు మరో బడా ఆఫర్ తగిలిందని న్యూస్ వినబడుతుంది.
అదేమిటంటే బాహుబలి తర్వాత సాహోలో నటిస్తున్న ప్రభాస్ తన తదుపరి చిత్రాన్ని జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. మరి బాహుబలితో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ పక్కన సాహోలో ఏకంగా బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ నటిస్తుండగా.. ఇప్పుడు రాధాకృష్ణ డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో పూజ హెగ్డేని హీరోయిన్ గా ఫైనల్ చేసారని అంటున్నారు. హీరోయిన్ గా పూజ హెగ్డే ఫైనల్ అని... కేవలం అధికారిక ప్రకటనే ఆలస్యం అంటున్నారు. మరి ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు.. గోపికృష్ణ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పక్కన పూజ హెగ్డే ఫిక్స్ అన్నమాట.
ఈలెక్కన ఒక్కసారిగా పూజ హెగ్డే వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో బుక్ అవుతుంది. ఇదిలా ఉంటే మరో పక్కన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలో కూడా పూజ హెగ్డేని పరిశీలనలోకి తీసుకుంటున్నారనే టాక్ ఉంది. మరి నిజంగానే ఎన్టీఆర్ పక్కన కూడా పూజ హెగ్డే గనక నిజమైతే ఇక పూజ కి టాలీవుడ్ లో తిరుగులేని కిరీటం దక్కుతుంది. మరి పూజ హెగ్డే కి వస్తున్న ఆఫర్స్ తో ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న అను, కీర్తి సురేష్, సమంతల పరిస్థితి ఏమిటో.