ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఉండి ఉంటే ఎంపీల సంఖ్యాబలంలో ముందుండేది. దాంతో కేంద్రంలో ఎన్నికలు జరిగి ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా ఏపీ కీలకంగా మారేది. కానీ ఏపీని ఈ విషయంలో దెబ్బతీసి బలహీనంగా చేయడం కోసమే నాడు కాంగ్రెస్, బిజెపిలు చిన్నరాష్ట్రాలు, తెలంగాణ సెంటిమెంట్ అనే వాటిని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని విభజించాయి. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలు తమకున్న ఎంపీల బలంతో కేంద్రంతో పోటీ పడలేని స్థితి వచ్చింది. ఇదంంతా బిజెపి నాయకులు, కర్ణాటకలకి చెందిన వీరప్ప మొయిలీ, తమిళనాడుకి చెందిన చిదంబరంల వ్యూహం. వారి ఎత్తుగడ ఫలించి రాష్ట్రం విడిపోవడం అనేది మనంతట మనం చేసుకున్న తప్పిదం. వారి అవకాశ వాదం కోసం తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య, నాయకులు, పార్టీల మధ్య చిచ్చుపెట్టి కాంగ్రెస్, బిజెపిలు వేసిన ట్రాప్‌లో అందరు పడిపోయారు. కాబట్టి ఇప్పుడు అనుకుని ఏమీలాభం లేదు. కనీసం రాష్ట్రం విడిపోకుండా కలిసే ఉండి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం బాగుపడి, కేంద్రానికి ధీటుగా సమాధానం చెప్పేది.
ఇక తాజాగా కమలనాధులు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్యరాష్ట్రాలలో కూడా బలం పుంజుకుంటడం ప్రమాద సంకేతాలను సూచిస్తోంది. దీంతో బిజెపి, కాంగ్రెస్‌లకి ప్రత్యామ్నాయంగా తృతీయ ఫ్రంట్ విషయం మరలా తెరపైకి వచ్చింది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, దేశాన్ని 70ఏళ్లుగా కాంగ్రెస్, బిజెపిలే పాలించాయి. ఆయా పార్టీలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఉండకూడదు. దేశరాజకీయాలలో ప్రభలమైన మార్పు రావాల్సివుంది. మోదీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని అన్నారు. అలా అయితే ఇచ్చి తీరాలి. అలా తాను అనకపోతే నేను అనలేదు.. ఇవ్వను అని చెప్పాలి. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలు, రాజకీయ నాయకులు, పార్టీలు ఆవేదన చెందే విధంగా ఎందుకు ప్రవర్తించాలి? ఇలాంటి పరిస్థితి వేరే దేశంలో ఉందా? ఇలా చేయడం సబబా? ప్రజలను వంచిస్తున్నారు. ఓ పని చేయాల్సివుంది. నా ఆరోగ్యం సహకరిస్తే ఆ పని ఖచ్చితంగా చేస్తాను. దేశంలో మూడో ప్రత్యామ్నయం రావచ్చు.
ఈ విషయంలో సీపీఎం నేత సీతారాం ఏచూరితో ఇప్పటికే మాట్లాడాను. బిజెపి, కాంగ్రెస్‌లు రైతులకు ఏమైనా చేశాయా? బిజెపి పోయి మరల కాంగ్రెస్ వస్తే ఏమైనా మార్పు వస్తుందా? అంటే రాదు అన్నారు. ఇక దక్షిణాదిన మాత్రం బిజెపి ఎదురుగాలి వీస్తోంది. త్వరలో కర్ణాటకలో ఎవరు విజయం సాధిస్తారు? అనే దానిపై భవ్యిత్తు ఆధారపడి ఉంది.