ఆ రాత్రి ఏమైందో.. బోనీ మాటల్లో..!

Boney Kapoor About Sridevi Death

అతిలోక సుందరి శ్రీదేవి దుబాయ్‌ హోటల్‌లో హఠ్మానరణం దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఇక అమర్‌సింగ్‌ ఏమో ఆమెకి వైన్‌ తప్ప మద్యం తాగే అలవాటు లేదని స్పష్టం చేశాడు. మరి శ్రీదేవి తన హోటల్‌ గదిలోని బాత్‌టబ్‌లో అపస్మారక స్థితిలో మృతి చెందడంపై సహజంగానే అందరికీ అనుమానాలు కలిగాయి. ఇక ఈ విషయంలో మొదటి సారిగా శ్రీదేవి భర్త బోనీకపూర్‌ ఆ రోజు ఏం జరిగింది? వంటి విషయాలను తన స్నేహితుడు, సినీ ట్రేడ్‌ ఎనిలిస్ట్‌ కోమల్‌ నాహ్తాకు పూస గుచ్చినట్లు చెప్పాడు. బుధవారం శ్రీదేవి అంత్యక్రియలకు ముందు బోనీ జరిగిన పరిణామాలన్నింటిని తన స్నేహితునికి తెలిపాడు. దానిని ఆయన తన బ్లాగ్‌లో రాస్తూ ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేశాడు. బోనీకపూర్‌ ఆయనకు చెప్పినది ఏమిటంటే... శ్రీదేవికి నేను 24వ తేదీ దుబాయ్‌కి వస్తున్నానని చెప్పలేదు. ఉదయం ఫోన్‌ చేసి మాత్రం మాట్లాడాను. ఇక నేను దుబాయ్‌ వెళ్లడానికి జాన్వి కూడా ఓకే అంది. ఎందుకంటే శ్రీదేవికి ఒంటరిగా ఉండటం భయం. ఇక పాస్‌పోర్ట్‌, ఇతర కీలక పత్రాలు మర్చిపోతుందని జాన్వి భయం. గత 24ఏళ్లలో నేను లేకుండా శ్రీదేవి రెండు సార్లు మాత్రమే విదేశాలకు వెళ్లింది. అది కూడా సినిమా ప్రదర్శనల కోసమే. 

అయితే ఆ రెండు సార్లు నా స్నేహితుని భార్యని ఆమెకి తోడుగా పంపాను. శ్రీదేవి ఒంటరిగా రెండు రోజులు ఉండటం అనేది ఈసారి దుబాయ్‌లోనే.. ఫిబ్రవరి 20న నేను, శ్రీదేవి, ఖుషీ కలిసి దుబాయ్‌లో పెళ్లికి వెళ్లాం. నాకు 22 వ తేదీ లక్నోలో కీలక సమావేశం ఉంటే ఇండియా వచ్చాను. శ్రీదేవి మాత్రం రిలాక్స్‌ అవుతూ అక్కడే ఉండి జాన్వి కోసం షాపింగ్స్‌ చేసింది. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3.30 నిమిషాలకు నేను దుబాయ్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నాను. దుబాయ్‌ కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 నిమిషాలకు శ్రీదేవిని కలుసుకున్నాను. హోటల్‌ వద్ద శ్రీదేవిని సర్‌ప్రైజ్‌ చేశాను. 15 నిమిషాలు గడిపి రీఫ్రెష్‌ అయి రొమాంటిక్‌ డిన్నర్‌కి వెళ్దామని ప్రతిపాదించాను. దాంతో శ్రీదేవి బాత్‌రూంలోకి వెళ్లింది. నేను లివింగ్‌ రూమ్‌లో టివి చూస్తూ గడిపాను. 8గంటలు కావస్తున్నా ఆమె బయటికి రాలేదు. శనివారం కావడంతో హోటల్‌ బిజీ అవుతుందని భావించి రెండు సార్లు శ్రీదేవిని బిగ్గరగా పిలిచాను. అయినా సమాధానం లేదు. దాంతో టీవీ వాల్యూమ్‌ తగ్గించి మరలా పిలిచాను. బెడ్‌రూంలోకి వెళ్లి డోర్‌ కొట్టి మరలా శ్రీదేవిని పిలిచాను. సమాధానం లేకపోవడం, లోపల ట్యాప్‌ ఆన్‌ చేసిన శబ్దం రావడంతో డోర్‌ తీశాను. గడియ పెట్టనందు వల్ల డోర్‌ వెంటనే ఓపెన్‌ అయింది. బాత్‌టబ్‌లో శ్రీదేవి పూర్తిగా మునిగిపోయి కనిపించింది. ఒక్క నిమిషం కూడా ఆమె వేదన అనుభవించిన దాఖలాలు లేవు. మొదట టబ్‌లోకి దిగి అపస్మారక స్థితిలోకి జారి ఉండవచ్చు, లేదా మొదట నిద్రలోకి జారుకుని అపస్మారక స్థితిలోకి జారుకుని నీట మునిగి ఉండవచ్చని, ఎందుకంటే బాత్‌ టబ్‌ పూర్తిగా నిండి ఉన్నా ఒక్క బొట్టు కూడా బయటకురాలేదు అని వివరించాడు కోమల్‌. 

ఇక శ్రీదేవి అస్దికలని కాశీలో కలపకుండా శ్రీదేవి జన్మించిన తమిళనాడులోని రామేశ్వరం సముద్రంలోని అగ్నితీర్ధంలో బోనీ, జాన్వి, ఖుషీలు కలిపారు.

Boney Kapoor Reveals what Happened Before Sridevi's Death

boney kapoor
reveals
sridevi death
friend
social media