గత నెల రోజులుగా ఒక హాట్ న్యూస్ ఫిలింసర్కిల్స్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే డైరెక్టర్ కమ్ కేరెక్టర్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస్ అవసరాల ప్రేమలో పడ్డాడు అని. అది కూడా ఒక యావరేజ్ హీరోయిన్ తో అని. కానీ నిన్నమొన్నటివరకు ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం బయటికి రాలేదు. ఇండస్ట్రీలోకి నటనతో అడుగుపెట్టిన శ్రీనివాస్ అవసరాల ఆ తర్వాత డైరెక్టర్ గా టర్న్ తీసుకుని సక్సెస్ అయ్యాడు. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాల్తో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న శ్రీనివాస్ అవసరాల జంటిల్మన్ సినిమాతో నెగెటివ్ షేడ్స్ ఉన్న యాక్టర్ గా కూడా ఆకట్టుకున్నాడు.
అయితే ఈ మధ్యన శ్రీనివాస్ అవసరాల తన కెరీర్ తోపాటు... ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని... ఆ హీరోయిన్ ఎవరో కాదని ఈ మధ్యనే అ! సినిమాతో న్యూ లుక్స్ తో ఆకట్టుకున్న ఈషా రెబ్బ అని చెబుతున్నారు. ఇకపోతే అ! సినిమాలో ఈషా రెబ్బతో పాటే... శ్రీనివాస్ అవసరాల కూడా నటించాడు. గత కొంతకాలంగా శ్రీనివాస్ అవసరాల, ఈషా రెబ్బలు కలిసి తిరగడమే కాదు.. కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని కూడా ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి వీరిద్దరూ మధ్యన ప్రేమ ఉందని చెబుతున్నా.... అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ..... వీరిద్దరూ మాత్రం తమ ప్రొఫెషన్ లో పూర్తిగా తలమునకలై ఉన్నారు.
ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల నటుడిగా బిజీగా ఉంటే... ఈషా రెబ్బ ప్రస్తుతం వెంకటేష్ - తేజ కలయికలో వస్తున్న ఆట నాదే వేట నాదే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.