'నేనే రాజు నేనే మంత్రి'తో దర్శకుడు తేజ మరలా ఫామ్‌లోకి వచ్చాడు. దాంతో అబ్బాయ్‌తో హిట్ కొట్టిన తేజకే సురేష్‌ప్రొడక్షన్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు భాగస్వామ్యంతో చేసే చిత్రాన్ని చేతిలో పెట్టారు. ఇది ఏ జోనర్ చిత్రం అనేది మాత్రం తెలియడం లేదు. టైటిల్‌గా 'ఆట నాదే వేట నాదే'ను పరిశీలిస్తున్నారట. ఇదే టైటిల్ కన్‌ఫర్మ్ అయిందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని కూడా భారీగా తీయకుండా 'దృశ్యం, గురు, గోపాల గోపాల' తరహాలో తక్కువ బడ్జెట్‌లోనే తీయాలని దర్శకుడు, నిర్మాతలు భావిస్తున్నారు.
ఇక ఈ చిత్రం స్టోరీ ప్రస్తుతం సమాజంలో జరిగే యదార్ధ సంఘటనల ఆధారంగా, పొలిటికల్ టచ్‌తో ఉండనుందని తెలుస్తోంది. ఇందులో వెంకీ కాలేజీ లెక్చరర్ పాత్రను చేయనున్నాడట. ఇప్పటివరకు తేజ తన కెరీర్‌లో మహేష్‌బాబుతో తప్ప మరో స్టార్‌తో సినిమా చేయలేదు. 'నిజం' కూడా పెద్ద హిట్ కాదు. దాంతో ఎన్టీఆర్ బయోపిక్ తేజ చేతిలోకి రావాలంటే వెంకీతో మూవీ ఖచ్చితంగా హిట్ కావాల్సిన అవసరం ఉంది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్‌కి జోడీగా కాజల్‌ని అనుకున్నారు. ఆమె రెమ్యూనరేషన్ కోటి ఉండటంతో రెమ్యూనరేషన్ విషయంలో కాస్త లిబరల్‌గా ఉండే శ్రియాశరణ్‌ని తీసుకున్నారు. గతంలో వెంకటేష్-శ్రియాశరణ్‌ల కాంబినేషన్‌లో 'సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల' చిత్రాలు వచ్చాయి.
ఇక ఈ చిత్రంలో నారా రోహిత్ కూడా కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఎంతో కీలకమైన ఈ పాత్రకి జోడీగా ఈషా హెబ్బాని సెలక్ట్ చేసుకున్నారు. ఈషా హెబ్బా తన కెరీర్‌లో 'అంతకు ముందు ఆ తర్వాత, అమీతుమీ, అ' చిత్రాలలో నటించింది. ఈ మూడు చిత్రాల టైటిల్స్ 'అ'తో మొదలయ్యాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో 'ఆటానాదే వేటా నాదే' చిత్రం కూడా 'ఆ'తోనే మొదలుకావడంతో ఈ చిత్రం ఆమెకి మరో హిట్‌ని అందిస్తుందో లేదో చూడాల్సివుంది!