Advertisementt

సవతి తల్లి బాటలో నడుస్తోంది..!

Sun 04th Mar 2018 05:16 PM
manjula ghattamaneni,manasuku nachindi,vijaya nirmala,2nd movie  సవతి తల్లి బాటలో నడుస్తోంది..!
Manjula in Vijaya Nirmala Way.. సవతి తల్లి బాటలో నడుస్తోంది..!
Advertisement
Ads by CJ

కృష్ణ రెండోభార్య విజయనిర్మల దాదాపు 50 చిత్రాలకు దర్శకురాలిగా పనిచేసింది. కృష్ణతో పాటు ఇతర హీరోలతో కూడా మల్టీస్టారర్‌, మాస్‌, యాక్షన్‌ చిత్రాలు తీసింది. అత్యధిక చిత్రాలను డైరెక్ట్‌ చేసిన లేడీ డైరెక్టర్‌గా ఆమె గిన్నీస్ బుక్‌లోకి కూడా ఎక్కింది కానీ ఈమె కెరీర్‌ ప్రారంభంలో ఫరవాలేదనిపించే చిత్రాలు చేసినా తర్వాత కాలంలో ఆమె డిజాస్టర్స్‌ని తీసింది. ఓ ఇంటర్వ్యూలో 100 చిత్రాలకు దర్శకత్వం వహించడం తన కోరిక అని ప్రకటించింది. దాంతో కృష్ణ వీరాభిమానులు కూడా ఖంగుతిన్నారు. ఆమె వంద చిత్రాల వరకు కృష్ణనే హీరోగా పెట్టుకుంటే ఇక ఆమె కెరీరే కాదు కృష్ణ కెరీర్‌ కూడా అంతం కావడం ఖాయమనే సెటైర్లు వినిపించాయి. కాగా ఇప్పుడు కృష్ణ మొదటి భార్య కూతురు ఘట్టమనేని మంజుల దర్శకురాలిగా మారింది. నిర్మాతగా, నటిగా ఉబలాటం తీర్చుకున్న ఆమె తాజాగా సందీప్‌కిషన్‌తో 'మనసుకు నచ్చింది' చిత్రానికి డైరెక్టర్‌గా చేసింది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు థియేటర్లలోనే గగ్గోలు మన్నారు. ఇదేం సినిమారా బాబూ అని తలలు పట్టుకున్నారు. నిర్మాత జెమిని కిరణ్‌ నిండా మునిగాడు. 

ఇక సందీప్‌కిషన్‌ సంగతి చెప్పడం అనవసరం. ఈ సినిమా ఫ్లాప్‌ అయితే అయ్యుండవచ్చు గానీ ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా. పవన్‌, మహేష్‌ల చిత్రాలను చేయాలని ఉందని, 'మనసుకు నచ్చింది' చిత్రం నచ్చలేదు అనే వారు వేస్ట్‌ ఫెలోస్‌ అని షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది దాంతో ఈ చిత్రం విడుదలైన తర్వాత చూసిన ప్రేక్షకులు ఈ చిత్రం మాకు నచ్చలేదు.. మేం వేస్ట్‌ ఫెలోస్‌.. ఇక ఈ చిత్రం తెలుగువారెవ్వరికీ నచ్చలేదు.. కాబట్టి తెలుగు ప్రజలందరూ వేస్ట్‌ ఫెలోసే అని సెటైర్లు వేశారు. 

ఇక ఈ చిత్రానికి మహేష్‌ చెప్పిన వాయిస్‌ ఓవర్‌ కూడా ఈ సినిమాని నిలబెట్టలేకపోయింది. అయినా పట్టువదలని మంజుల మరో స్టోరీ తయారు చేసుకుని, తన సొంత ఇందిరా ప్రొడక్షన్స్‌ బేనర్‌లో ఈ చిత్రానికి నిర్మాతగా, దర్శకురాలిగా పని చేయనుందట. 'మనసుకు నచ్చింది' స్టోరీ ముందు నాని, విజయ్‌దేవరకొండ, శర్వానంద్‌లకు చెబితే నో అన్నారు. బుట్టలో సందీప్‌కిషన్‌ పడ్డాడు. మరి ఈ తదుపరి చిత్రం కోసం ఆమె ఎవరిని ఒప్పించి, హీరోగా తీసుకుంటుందో వేచిచూడాల్సివుంది.

Manjula in Vijaya Nirmala Way..:

Manjula Ghattamaneni Ready With 2nd Film?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ