Advertisementt

అల్లరోడి ఆవేదన విన్నారా..!

Sun 04th Mar 2018 05:08 PM
allari naresh,nenu movie,3 months,locked  అల్లరోడి ఆవేదన విన్నారా..!
Comedy King Locked Himself For 3 Months అల్లరోడి ఆవేదన విన్నారా..!
Advertisement
Ads by CJ

తెలుగులో రాజేంద్రప్రసాద్‌ తర్వాత చాలా గ్యాప్‌ వచ్చినప్పటికీ ఆయన స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేకపోయారు. కానీ అల్లరి నరేష్‌ మాత్రం అంతగా కాకపోయినా ఎంతో కొంత ఆయన స్థానాన్ని ఆక్రమించాడు. ఇక అల్లరి నరేష్‌ అతి వేగంగా 50 చిత్రాలను పూర్తి చేసుకున్నాడు. ఈవీవీ సత్యనారాయణ ఎందరికో హిట్‌ ఇచ్చినా తన కుమారులైన ఆర్యన్‌ రాజేష్‌, అల్లరి నరేష్‌లకి పెద్దగా సక్సెస్‌లు ఇవ్వలేకపోయాడు. ఇక ఆర్యన్‌ రాజేష్‌ కెరీర్‌లో ఆయన తండ్రి తీసిన 'ఎవడి గోల వాడిది', దేవి ప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన 'లీలామహల్‌ సెంటర్‌' మాత్రమే బాగా ఆడాయి. ఆ తర్వాత ఆయన తమిళంలో కూడా ట్రై చేశాడు. కానీ విజయం లభించలేదు. ఇక నరేష్‌ని కూడా 'అల్లరి' ద్వారా రవిబాబు అల్లరి నరేష్‌గా మార్చి హిట్‌ ఇచ్చాడు. ఈయనపై కామెడీ హీరో అనే బ్రాండ్‌ ఉన్నా కూడా ఈయన 'నేను, ప్రాణం, గమ్యం' వంటి విభిన్న చిత్రాలు చేశాడు. ఇక ఈయన తన తండ్రితో 9 చిత్రాలు చేస్తే అందులో ఏడు చిత్రాలు హిట్టయ్యాయి. వరుసగా సక్సెస్‌లతో ముందుకు సాగిన అల్లరినరేష్‌ 'సుడిగాడు'తో హైరేంజ్‌కి వెళ్లి ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా చేసింది. 

ఇక ఇందులో ౧౦౦ చిత్రాలకు సరిపడా స్పూఫ్‌లు చేశారు. ఆ తర్వాతి చిత్రాలన్నీ ఆ చిత్రంతో పోల్చుకోవడం వల్ల కనీసం యావరేజ్‌ కూడా కాలేదు. ప్రస్తుతం ఆయనకు హిట్‌ వచ్చి ఎంతో కాలం అయింది. ఈయన తాజాగా మాట్లాడుతూ, నేను నటించిన చిత్రాలలో 'నేను' చిత్రం కథ ఎంతో బాగా నచ్చింది. ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టపడి చేశాను. ఈ చిత్రం కథ నాకు డిఫరెంట్‌గా అనిపించింది. దాంతో ఈ చిత్రంపైనే దృష్టి పెట్టడంతో పలు ఆఫర్లు వదులుకున్నాను. ఇది నాకు మంచి టర్నింగ్‌ పాయింట్‌ మూవీ అవుతుందని భావించాను. కానీ అందరు చిత్రం బాగుందని అన్నారే గానీ సినిమా ఆడలేదు. దాంతో మూడు నెలలు డిప్రెషన్‌కి లోనై ఇంట్లో నుంచి బయటికి రాలేదు. తర్వాత నాన్నగారి 'కితకితలు' ద్వారా నాకు హిట్‌ వచ్చింది. మా నాన్నతో నేను చేసింది పది చిత్రాలు కూడా లేవు. మిగిలిన 40కి పైగా చిత్రాలను ఇతరులతోనే చేశాను. 

ఇక మా నాన్నగారు 'గమ్యం' సినిమా చూసి కథగా చెప్పి ఉంటే ఈ చిత్రం వద్దని చెప్పేవాడిని, కానీ స్క్రీన్‌పై చూస్తే అద్భుతంగా ఉంది. మంచి సినిమా.. చాలా బాగా చేశావు అని పొగిడారు అని తెలిపాడు. ఇక చిత్రాల ఎంపికలో కూడా మా నాన్నగారు జోక్యం చేసుకునే వారు కాదు. నా నిర్ణయానికే వదిలేసేవారు.. అని చెప్పిన ఆయన తన అన్నయ్య ఆర్యన్‌ రాజేష్‌తో కలిసి నిర్మాతగా ఈవీవీ సినిమాపై తీసిన 'బందిపోటు' కూడా ఫ్లాప్‌ కావడం బాధాకరం. దాంతో ప్రస్తుతం ఆయన మహేష్‌ 25 చిత్రమైన దిల్‌రాజు, అశ్వనీదత్‌, వంశీపైడిపల్లిల చిత్రంలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ చేస్తుంటే. ఆయన అన్నయ్య ఆర్యన్‌ రాజేష్‌ బోయపాటి, రామ్‌చరణ్‌ చిత్రంలో చరణ్‌కి చిన్న అన్నయ్యగా నటించడానికి ఓకే చెప్పాడని తెలుస్తోంది.

Comedy King Locked Himself For 3 Months:

Allari Naresh locked himself in a room for 3 months

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ