రాంగోపాల్‌వర్మ శిష్యులంటే వారి వ్యవహారాలు ఎంతో తేడాగా ఉంటాయి. కృష్ణవంశీ, తేజ, జెడి చక్రవర్తి... ఇలా అందరు తేడా వారే. వారేం అనుకుంటే అది జరగాల్సిందే. తేడా వస్తే సినిమా వదిలేసి వెళ్లిపోతారు. ఇక వర్మ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విషయంలో వైసీపీ నాయకులు, వైసీపీ నేత అయిన నిర్మాత ఇచ్చే సజెషన్స్‌కి కోపం వచ్చి మౌనంగా ఉన్నాడని అంటున్నారు. ఇక తేజ విషయం మరింత తేడా. ఈయన ఎక్కువగా కొత్తవారితో, న్యూటాలెంట్‌ని నమ్ముకుంటాడు. సరిగా పనిచేయకపోతే చేయి చేసుకుంటాడు. ఆయన సినిమాలలో నటించి దెబ్బలు తిన్నవారు ఎందరో ఉన్నారు. చివరకు మురళీమోహన్ వంటి సీనియర్‌ని కూడా నటించడం చేతకాదు అని తిట్టి 'నిజం'లో ఆ పాత్రను ప్రకాష్‌రాజ్‌కి ఇచ్చాడు. ఇక 'నేనే రాజు నేనేమంత్రి' చిత్రాన్ని కూడా రాజశేఖర్‌తో 'అహం'గా తీసి క్లైమాక్స్‌లో క్రియేటివ్ డిఫరెన్స్‌లు రావడంతో దానిని పడేసి మరలా సురేష్‌బాబు, రానాలను తన సినిమాలో వేలుపెట్టను అంటేనే చేస్తానని చెప్పి 'నేనే రాజు నేనేమంత్రి' చేశాడు.
ఇక 'నిజం' సమయంలో మహేష్ రెమ్యూనరేషన్ కోటి కూడా లేదని, కానీ తాను ఆ చిత్రం కోసం ఆయనకు ఐదు కోట్లిచ్చానని, సినిమా మొత్తం 15, 20కోట్లలో పూర్తి చేసి 30కోట్లకు పైగా బిజినెస్ చేశామని, మరి మహేష్ ఆ చిత్రాన్ని ఫ్లాప్ అని ఎలా అంటాడని బహిరంగంగా వ్యాఖ్యానించాడు. ఇక తేజ విషయం ఇలా ఉంటే బాలయ్య మరో తేడా సింగ్. ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. తేజ బాగా చేయకపోతే కొడతాడు. బాలయ్య మాత్రం బాగా చేసినా కూడా మూడ్‌ని బట్టి ఇతరులను కొడుతుంటాడు. కారణాలు ఆయనకే తెలియాలి. అంతా నా ఇష్టం అనే టైప్ ఆయన. ఇలా తేజ, బాలయ్య ఇద్దరు మనస్తత్వాలు, నేపధ్యాలు, ఎమోషన్స్ పరస్సర విరుద్దం. అలాంటి సమయంలో తేజతో బాలయ్య 'ఎన్టీఆర్' చిత్రం చేస్తున్నాడని తెలిసి అందరు విస్తుపోయారు. ఇక తేజ తనకిష్టం లేకుండా ఏ ఆర్టిస్ట్‌ని, టెక్నీషియన్‌ని ఒప్పుకోడు. కానీ 'ఎన్టీఆర్' విషయంలో మాత్రం బాలయ్య స్క్రిప్ట్ నుంచి టెక్నీషియన్స్, నటీనటులు అన్ని తాను చెప్పిందే జరగాలని శాసిస్తున్నాడట.
దీంతో తేజ ఆ సినిమా విషయం వదిలిపెట్టి వెంకటేష్ మూవీతో బిజీ అయ్యాడు. ఇక సాయిమాధవ్ బుర్రాతో పూర్తి స్క్రిప్ట్‌ని తానే పక్కనుండి తయారు చేసిన తర్వాత తేజ చేతికి ఇచ్చి, కేవలం యాక్షన్, కట్ అనే వరకే ఆయన్ను పరిమితం చేయాలనేది బాలయ్య ఆలోచన. దాంతో మార్చిలోనే మొదలవుతుందని చెప్పిన 'ఎన్టీఆర్' చిత్రం ఇప్పటికి కూడా సెట్స్‌పైకి వెళ్లలేదు. మరోవైపు బాలయ్య కూడా ఒకసారి ముందుగా 'ఎన్టీఆర్' చేయాలని, మరికొంత సేపటికి ఈ గ్యాప్‌లో మరో చిత్రం చేయాలని ఇలా పికిల్ మైండెడ్‌గా ఉన్నాడని తెలుస్తోంది. సో.. తేజ ప్రస్తుతం వెంకీ చిత్రంపైనే ఫోకస్ పెడితే బాలయ్య అనిల్‌రావిపూడితో ముందుకెళ్లి 'ఎన్టీఆర్' లోపు మరో చిత్రం చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది.