Advertisementt

అర్జున్‌రెడ్డికి కూడా బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయట!

Sun 04th Mar 2018 02:34 PM
vijay devarakonda,backlogs,movies,revealed  అర్జున్‌రెడ్డికి కూడా బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయట!
Vijay Devarakonda's Backlogs Revealed అర్జున్‌రెడ్డికి కూడా బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయట!
Advertisement
Ads by CJ

సాధారణంగా కొందరు నటించిన చిత్రాలు మొదట్లో విడుదలకు నోచుకోవు. అదే వారి చిత్రం ఒక్కటి హిట్‌ అయిందంటే మాత్రం నాడు ఆగిపోయిన చిత్రాలన్నీ రిలీజ్‌కి క్యూకడుతుంటాయి. అవి రిలీజ్‌ కావడం ఆయా హీరోలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏ అవకాశం లేక చేసిన ఆ చిత్రాలు విడుదలై ఫ్లాప్‌ అయితే అవి కూడా తమ కౌంట్‌లోకి వస్తాయని భయం. ఇలాంటి పరిస్థితి అందరకీ ఎదురవుతుంది. ఉదాహరణకు ఉదయ్‌కిరణ్‌నే తీసుకుందాం. ఆయన 'చిత్రం' కంటే ముందు లేడీ గెటప్‌లో 'జోడీనెంబర్‌ 1' అనే చిత్రం చేశాడు. ఆగిపోయిన ఈ తలాతోక లేని చిత్రం ఉదయ్‌ చిత్రాలు వరుసగా హట్‌ కావడంతో విడుదలై ఉదయ్‌కి చెడ్డపేరు తెచ్చింది. 

ప్రస్తుతం అర్జున్‌రెడ్డి అదేనండీ విజయ్‌దేవరకొండ ఎప్పుడు 2014లో చేసిన 'ఏ మంత్రం వేశావే' చిత్రం ఆప్పుడు విడుదల కాకుండా ఇప్పుడు విడుదల అవుతోంది. దీంతో విజయ్‌ స్పందిస్తూ 'నాకు కూడా బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయబ్బా' అంటూ కామెంట్‌ చేశాడు. ఇంట్లో తెలియకుండా చేయాలనుకున్నా.. కానీ ఐదేళ్ల తర్వాత యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది' అంటూ కామెంట్‌ చేశాడు. మరి 'ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి' మాత్రం ఈ సినిమా ఆపడానికి నానా విధాలుగా ట్రై చేసినా వీలుకాలేదని సమాధానం.

Vijay Devarakonda's Backlogs Revealed:

I am Also Have Backlogs, says Vijay Devarakonda 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ