Advertisementt

చరణ్ ఇంకా చిరు కూచీయేనా..?

Sun 04th Mar 2018 08:46 AM
chiranjeevi,ram charan,swap,directors  చరణ్ ఇంకా చిరు కూచీయేనా..?
Chiranjeevi Involvement in Ram Charan Movie Scripts చరణ్ ఇంకా చిరు కూచీయేనా..?
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ చిరంజీవి కొడుకుగా స్టార్ట్ అయింది. కానీ కొన్నాళ్లు తర్వాత ఆ మార్క్ పోయింది. చరణ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ వున్నాయి అలానే డిజాస్టర్స్ కూడా వున్నాయి. ఒకవైపు నటుడిగా మెప్పిస్తూ..నటనకు ఇంపార్టెన్స్ వున్న పాత్రలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకెళుతున్నాడు. కానీ ఇప్పటి రామ్ చరణ్ కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు తీసులేకపోతున్నాడట.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ మల్టీ స్టార్రర్ చరణ్ - ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి చరణ్ కు కథ చెప్పిన వెంటనే ఓకే చేయలేదంట. చేద్దామా.. వద్దా అనే డౌట్ తో తండ్రి చిరంజీవి సలహా కోసం వెళ్లాడు. రాజమౌళి తీసే సినిమా కెరీర్ లో మైలురాయిగా మిగిలిపోవడమే కాదు... ఓ ట్రెండ్ సెట్టర్ సినిమా కూడా అయ్యే అవకాశం ఉందని చరణ్ చెప్పారంట.

సో వెంటనే వెళ్లి రాజమౌళితో సినిమా చేస్తా అని చెప్పాడన్నది అతడి సన్నిహితుల నుంచి వినిపిస్తున్న టాక్. ఇన్ని సినిమాలు చేసిన అనుభవం వున్న చరణ్ కు ఇంకా ఏ సినిమా చేయాలో వద్దో సొంతంగా ఠక్కున నిర్ణయం తీసుకోవడం లేదు.  ఇంట్లో నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే సినిమాను ఓకే చేస్తున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకోకపోతే కష్టం అంటున్నారు సినీ పండితులు.

Chiranjeevi Involvement in Ram Charan Movie Scripts:

Megastar Chiranjeevi And Ram Charan To Swap Directors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ