నాని నిర్మాణంలో తెరకెక్కిన 'అ!' సినిమాలో హీరోయిన్ నిత్యామీనన్ లెస్బియన్ పాత్ర పోషించి ఆకట్టుకుంది. అయితే నాని నిర్మాతగా సక్సెస్ అయినందుకు ఆనందపడుతున్నానని.. కానీ తాను ఫ్యూచర్ లో ఎట్టి పరిస్థితిలో ప్రొడ్యూసర్ గా మారనని స్పష్టం చేసింది. అంతే కాకుండా భవిష్యత్ లో కచ్చితంగా ఓ సినిమాను డైరెక్ట్ చేస్తానని తన మనసులో మాటగా అందరికి చెప్పింది. అలాగే డైరెక్షన్ ఎలా చేయాలనీ అన్నదానిపై అవగాహన పెంచుకుంటున్నానని ఆమె తెలిపింది.
లేటెస్ట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చింది నిత్య మీనన్. అలానే ఇక తానూ నటించబోయే సినిమాల్లో తన పాత్ర గురించి దర్శకుడితో లోతుగా చర్చిస్తానని తెలిపింది. పాత్రని ఎలా డెవలెప్ చేయాలో మాటల విషయంలో ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలో డైరెక్టర్స్ దగ్గర అడిగి తెలుసుకుంటానని చెప్పింది.
మాములుగా నాకు తక్కువ సినిమాలే వస్తున్నాయి. అలా అని వచ్చిన అన్ని సినిమాలు ఓకే చెయ్యట్లేదు. పాత్రకు ఇంపార్టెన్స్ వున్న పాత్రలే సెలెక్ట్ చేసుకుని చేస్తున్నాను.. అని చెప్పుకొచ్చింది నిత్యామీనన్.