Advertisementt

ఈ భామ.. సాయిపల్లవికి చెక్‌పెట్టనుందా?

Sat 03rd Mar 2018 12:50 PM
priya prakash varrier,oru adaar love,tollywood,uv creations  ఈ భామ.. సాయిపల్లవికి చెక్‌పెట్టనుందా?
Top Banner Launching Internet Sensation ఈ భామ.. సాయిపల్లవికి చెక్‌పెట్టనుందా?
Advertisement
Ads by CJ

ఇటీవల టాలీవుడ్‌పై మలయాళ కుట్టీల దండయాత్ర జరుగుతోంది. తమిళనాడులోనే పుట్టినా మలయాళ చిత్రం ద్వారా టాలెంట్‌ నిరూపించుకున్న సాయిపల్లవి, కీర్తిసురేష్‌, అనుపమ పరమేశ్వరన్‌, అను ఇమ్మాన్యుయేల్‌ వంటి వారు తెలుగులో హవా సాగిస్తున్నారు. ఇక అను ఇమ్మాన్యుయేల్‌కి 'అజ్ఞాతవాసి' షాక్‌ ఇచ్చింది. ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో చేస్తున్న 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' తర్వాత ఈమె పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి...! 'అజ్ఞాతవాసి' సమయంలో పలు స్టార్స్‌ సరసన ఈమె పేరు వినిపించింది. కానీ వాటిని కైరాదత్‌, పూజాహెగ్డేలు తన్నుకుపోయారు. ఇక కీర్తిసురేష్‌ పరిస్థితి కూడా 'అజ్ఞాతవాసి'తో దెబ్బతింది. ఇక ఈమె 'మహానటి' చిత్రం చేస్తోంది. గ్లామర్‌షోకి ఇప్పటికే నో చెప్పింది.

ఇక తెలుగులో మలయాళం, తమిళంలాగా గ్లామర్‌షో చేయమని, నటనా ప్రాధాన్యం ఉంటేనే చేస్తామని అంటే వీలుకాదు. సమంతలాగా మాస్‌, క్లాస్‌ని మెప్పించే చిత్రాలు చేస్తేనే ఇక్కడ లాంగ్‌స్టాడింగ్‌ ఉంటుంది. దీనికి నిత్యామీనన్‌ ఓ ఉదాహరణ. ఇక అనుపమపరమేశ్వరన్‌ నటిగా మంచి పేరు తెచ్చుకున్నా, గ్లామర్‌ షోకి ఆమె లుక్‌ సెట్‌ కాదు. ఇక సాయిపల్లవి ఈమధ్య 'నేనులోకల్‌' చిత్రంలో నటించి, ఏమాత్రం నటనకు ప్రాధాన్యంలేని చిత్రంలో చేసి విమర్శలు మూటగట్టుకుంది. ఇక ఈమెపై క్రమశిక్షణ విషయంలో పలు వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి నేపధ్యంలో కేవలం తన కళ్ల హావభావాలతోనే ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయిన ఇంటర్నెట్‌ సంచలనం ప్రియా ప్రకాష్‌ వారియర్‌పై ఇప్పుడు తెలుగు ఫిల్మ్‌మేకర్స్‌ చూపు ఉంది. ఆల్‌రెడీ వారియర్‌ని తన చిత్రంలో నటించమని దిల్‌రాజు కోరాడట. కానీ అది వర్కౌట్‌ కాలేదని తెలుస్తోంది. యూవి క్రియేషన్స్‌ అధినేతలు కూడా ఆమెని సంప్రదించారని సమాచారం. కానీ ఓ బడా నిర్మాత తెలుగులో చేసే చిత్రానికి ప్రియా వారియర్‌ ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.

ఈమె కాస్త గ్లామర్‌షోతో పాటు తన హావభావాలను చూపిస్తే తెలుగు ప్రేక్షకకులు ఈజీగానే కనెక్ట్‌ అవుతారు. ఇక ఈమెకి గ్లామర్‌ షో విషయంలో కూడా పెద్దగా పట్టింపులు లేవని తెలుస్తోంది. కాగా ఈమె నటించిన 'ఒరు ఆధార్‌ లవ్‌' తాజాగా మలయాళంలో విడుదలైంది. దీని పూర్తి ఫలితం తెలియాలంటే మరో రెండు మూడు రోజులు పడుతుంది. దానిని బట్టి మన నిర్మాతలు ఆమెని తీసుకోవాలా? ఎంత రెమ్యూనరేషన్‌ ఇవ్వవచ్చు? అనే అంశాలు ఆధారపడి ఉంటాయనే చెప్పాలి. ఈమె ఏమాత్రం ఆకట్టుకున్నా సాయిపల్లవికి పోటీ కావడం ఖాయంగా కనిపిస్తోంది....!

Top Banner Launching Internet Sensation:

Priya Prakash to make her Tollywood debut

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ